చరణ్ కాదన్నా.. అక్షయ్ ఛాన్సిచ్చాడు | Ileana Got Offer in Akshay Kumar Rustum | Sakshi
Sakshi News home page

చరణ్ కాదన్నా.. అక్షయ్ ఛాన్సిచ్చాడు

Feb 10 2016 11:17 AM | Updated on Sep 3 2017 5:22 PM

చరణ్ కాదన్నా.. అక్షయ్ ఛాన్సిచ్చాడు

చరణ్ కాదన్నా.. అక్షయ్ ఛాన్సిచ్చాడు

దక్షిణాదిలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తరువాత బాలీవుడ్ బాట పట్టిన అందాల భామ ఇలియానా. సౌత్లో స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి టాప్ హీరోయిన్గా పేరుతెచ్చుకున్న ఈ బ్యూటీ...

దక్షిణాదిలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తరువాత బాలీవుడ్ బాట పట్టిన అందాల భామ ఇలియానా. సౌత్లో స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి టాప్ హీరోయిన్గా పేరుతెచ్చుకున్న ఈ బ్యూటీ, ఇటీవల కాలంలో అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా బాలీవుడ్ అవకాశాల కోసం ముంబై వెళ్లిపోవటంతో పాటు, వచ్చిన అవకాశాలకు భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయటంతో తెలుగు దర్శక నిర్మాతలు ఈ అమ్మడిని పక్కన పెట్టేశారు. అదే సమయంలో బాలీవుడ్లో కూడా అవకాశాలు లేకపోవటంతో ఈ గోవా బ్యూటీ చాలా రోజులుగా ఖాళీగానే ఉంటోంది.

ఇటీవల కాలంలో సౌత్ ఇండస్ట్రీ మీద దృష్టి పెట్టిన ఇల్లీ బేబీ, అవకాశాల కోసం తనకు తెలిసి వాళ్లను సంప్రదించటం మొదలుపెట్టింది. అయితే ఆ ప్రయత్నాలు కూడా పెద్దగా ఫలించలేదు. టాలీవుడ్లో అవకాశాలు వచ్చినట్టుగానే వచ్చి చేజారిపోయాయి. బ్రూస్ లీ సినిమాలో ఐటమ్ సాంగ్తో పాటు, చరణ్ చేస్తున్న తనీఒరువన్ రీమేక్లో హీరోయిన్ ఛాన్స్ కూడా మిస్ అవ్వటంతో మరోసారి డీలాపడిపోయింది.

చరణ్ కాదన్నా.. అక్షయ్ మాత్రం పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న రుస్తుం సినిమా కోసం ఇలియానాను హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారు. స్పెషల్ చబ్బీస్, బేబీ లాంటి సినిమాలతో వరుస హిట్స్ సాధించిన నీరజ్ పాండే దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ఛాన్స్ రావటంతో ఇలియానా ఫుల్ హ్యాపీగా ఉంది. మరి ఈ సినిమాతో అయినా ఇలియానా మళ్లీ బిజీ అవుతుందేమో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement