నేను ఎవరికీ భయపడను: రణబీర్ కపూర్! | I don't fear anybody except my father: Ranbir Kapoor | Sakshi
Sakshi News home page

నేను ఎవరికీ భయపడను: రణబీర్ కపూర్!

Sep 18 2013 1:26 PM | Updated on Apr 3 2019 6:23 PM

నేను ఎవరికీ భయపడను: రణబీర్ కపూర్! - Sakshi

నేను ఎవరికీ భయపడను: రణబీర్ కపూర్!

'నేను ఎవ్వరికి భయపడను' అని బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ అన్నాడు.

'నేను ఎవ్వరికి భయపడను' అని బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ అన్నాడు. ఒకవేళ భయపడాల్సి వస్తే తన తండ్రికి తప్ప ఎవరికి భయపడను అని అన్నాడు. అంతేకాక ఎవరైనా టాప్ డైరెక్టర్లు తనతో పనిచేయమంటే భయం కలుగుతుంది అని అన్నాడు. భవిష్యత్ లో ఇంతియాజ్ ఆలీ, అనురాగ్ బసు లాంటి డైరెక్టర్లు పనిచేయనంటే భయం కలుగుతుంది అని అన్నాడు. ఇటీవల వార్తా ఏజెన్సీకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎప్పడు విజయాన్ని తలకు ఎక్కించుకోను అని అన్నాడు. ఇప్పటికి తాను తన తండ్రి కళ్లలోకి చూసి మాట్లాడలేను అని.. తన తండ్రి అంటే భయంతోపాటు భక్తికూడా ఉందని.. బేషరమ్ చిత్రంలో తన తల్లితండ్రులు రిషి కపూర్, నీతూ కపూర్ లతో కలిసి నటిస్తున్నాడు. తన తండ్రితో కలిసి పనిచేయడం ఓ పక్క ఆనందంగా, భయంగాను ఉందన్నాడు. యే జవానీ హై దివానీ చిత్రంతో హిట్ సాధించిన రణబీర్ బేషరమ్ చిత్రంతో మరోసారి అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement