సంగీత దర్శకుడికి షాక్‌.. మూడు కోడిగుడ్లు రూ.1672

Hotel Charges Composer Shekhar Ravjiani Over Rs 1600 For 3 Eggs - Sakshi

అహ్మదాబాద్‌ : సాధార‌ణంగా కోడిగుడ్డు ఐదు రూపాయిల నుంచి ప‌ది రూపాయిల వ‌ర‌కు ఉంటాయి. కానీ ఓ స్టార్ హోటల్‌లో మూడు కోడిగుడ్ల‌కు ఏకంగా రూ.1672 బిల్లు వేశారు. ఈ సంఘ‌ట‌న గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో జరిగింది. అహ్మదాబాద్‌లోని హయత్ రీజెన్సీ హోటల్‌లో మూడు ఉడికించిన కోడిగుడ్లకు గాను.. బాలీవుడ్ సంగీత దర్శకుడు శేఖర్ రావ్‌జియానీ చేతికి ఇచ్చిన బిల్లు రూ.1672 ఇదేనంటూ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. హయత్ రీజెన్సీ హోటల్‌లో బసచేసిన శేఖర్‌ రావ్‌ జియానీ గురువారం రోజున మూడు ఎగ్‌వైట్‌లతో భోజనం ఆర్డర్‌ చేశారు.

అయితే హయత్ రీజెన్సీ హోటల్ సప్లయర్ మూడు బాయిల్డ్ ఎగ్స్‌ను ఇచ్చి శేఖర్ చేతిలో 1672 రూపాయల బిల్లు పెట్టాడు. బిల్లును చూసి శేఖర్ ఆశ్చర్యపోయాడు. షాక్ నుంచి కోలుకునేందుకు కొన్ని నిమిషాలు పట్టింది. కొన్ని నిమిషాల తర్వాత తేరుకున్న శేఖర్ రావూజీ దానిని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. దీంతో ఇప్పుడీ బిల్లు వైరల్ అయింది. 15 రూపాయల కోడిగుడ్లకు రూ.1672 ఏంటంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. మూడు ఉడికించిన కోడిగుడ్లకు 1350 రూపాయలు, సర్వీస్ చార్జీగా 67.50 రూపాయలు, సీజీఎస్టీ 9శాతం కింద 127.58 పైసలు, ఎస్ జీఎస్టీ 9శాతం కింద మరో రూ.127.58 కలిపి మొత్తం 1672రూపాయలు చెల్లించాలని బిల్లులో పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top