హృతిక్-కంగనాల వివాదం ముగిసిపోతుంది | Hope Hrithik-Kangana tussle ends soon: Jacqueline | Sakshi
Sakshi News home page

హృతిక్-కంగనాల వివాదం ముగిసిపోతుంది

May 3 2016 3:49 PM | Updated on Apr 3 2019 6:34 PM

హృతిక్-కంగనాల వివాదం ముగిసిపోతుంది - Sakshi

హృతిక్-కంగనాల వివాదం ముగిసిపోతుంది

బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిన మాజీ ప్రేమికులు హృతిక్ రోషన్, కంగనారనౌత్ వివాదంపై నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్పందించింది.

ముంబై: బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిన మాజీ ప్రేమికులు హృతిక్ రోషన్, కంగనారనౌత్ వివాదంపై నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్పందించింది. హృతిక్, కంగనాల మధ్య ఏర్పడిన వివాదం త్వరలోనే ముగుస్తుందని ఆశాభావం వ్యక్తంచేసింది.

ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఫెర్నాండెజ్.. 'హృతిక్-కంగనాల వివాదం త్వరలోనే సమసిపోతుంది. దీనివల్ల ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు. ఇప్పట్నుంచి వారిద్దరూ సరైన పంథాలో వెళ్లాలి. ఇద్దరూ ఓ నిర్ణయానికి వస్తారని భావిస్తున్నా' అని చెప్పింది. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధార్థ మల్హోత్రా.. హృతిక్, కంగనాల వివాదం వారి వ్యక్తిగతమని అన్నాడు. వారి విషయం తనకు తెలియదని, దీని గురించి మాట్లాడే హక్కు లేదని చెప్పాడు.

హృతిక్, కంగనాల మధ్య విభేదాలు ఏర్పడ్డాక పరస్పరం లీగల్ నోటీసులు ఇచ్చారు. కంగనా పంపిన్ మెయిల్స్ ను హృతిక్ బయటపెట్టడంతో గొడవ మరింత పెద్దదైంది. తన మెయిల్ ను హ్యాక్ చేసిన తర్వాత, తన పేరుతో ఫేక్ ఈమెయిల్ అకౌంట్ ఉందంటూ హృతిక్ ఫిర్యాదు చేయడంపై కంగనా ప్రశ్నించింది. అప్పటినుంచి ఈ వివాదం రోజుకో మలుపుతిరుగుతూ మరింత ముదిరింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement