నా అహం దెబ్బతింది | Hippi Movie Press Meet | Sakshi
Sakshi News home page

నా అహం దెబ్బతింది

Apr 5 2019 6:09 AM | Updated on Apr 5 2019 6:09 AM

Hippi Movie Press Meet - Sakshi

కలైపులి యస్‌ థాను, జేడీ చక్రవర్తి, దిగంగనా సూర్యవంశీ, టీఎన్‌ కృష్ణ, కార్తికేయ

‘‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమా విడుదలకు ముందునుంచే కార్తికేయ తెలుసు. ఈ చిత్రంలో నేను చేసిన పాత్రకి దర్శకుడు నన్ను పరీక్షించాలన్నప్పుడు నా అహం దెబ్బతింది. అయితే.. తను చెప్పిన విషయాన్ని నేను నెగటివ్‌గా తీసుకొని ఉంటే మంచిపాత్రలో నటించే అవకాశం వచ్చేది కాదు’’ అని నటుడు జేడీ చక్రవర్తి అన్నారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హిప్పీ’. టి.ఎన్‌. కృష్ణ దర్శకుడు. వి. క్రియేషన్స్, ఏషియన్‌ సినిమాస్‌ పతాకాలపై కలైపులి యస్‌.థాను నిర్మిస్తున్నారు.

దిగంగనా సూర్యవంశీ, జబ్బాసింగ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కార్తికేయ మాట్లాడుతూ– ‘‘ఆర్‌ఎక్స్‌ 100’ తర్వాత చాలా కథలు విన్నా. అదే టైమ్‌లో ‘నువ్వు నేను ప్రేమ’ ఫేమ్‌ టి.ఎన్‌.కృష్ణగారు వినిపించిన ‘హిప్పీ’ కథ కొత్తగా అనిపించడంతో వెంటనే ఓకే చెప్పేశా. కలైపులి థానుగారు ఓకే చెప్పడంతో సినిమా మొదలైంది. జేడీ చక్రవర్తిగారు చాలా ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటించారు. ఈ సినిమాలో దాదాపు అందరూ నాకంటే సీనియర్లే పని చేశారు.

విజువల్స్‌ చాలా గ్రాంyŠ గా ఉంటాయి. ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాని మించి ‘హిప్పీ’ బ్లాక్‌బస్టర్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. టి.ఎన్‌. కృష్ణ మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్‌ కామెడీ చిత్రమిది. కథ చాలా సింపుల్‌. మన ఇరుగు పొరుగు ఇళ్లలో జరుగుతున్నట్లు ఉంటుంది. సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. మన జీవితంలో నిత్యం జరిగే ఎన్నో అంశాలు ఇందులో ఉంటాయి. ఈ సినిమాని తొలుత తమిళంలో చేయాలనుకున్నాం.

‘ఆర్‌ఎక్స్‌ 100’లో కార్తికేయను చూశాక ‘హిప్పీ’ ఇతనితో ఎందుకు చేయకూడదు? అనిపించింది. కథ అతనికి నచ్చడంతో తెలుగులో ఈ సినిమా స్టార్ట్‌ అయింది’’ అన్నారు. ‘‘నేను ఎప్పుటి నుంచో తెలుగులో నేరుగా ఓ సినిమా తీయాలనుకుంటుంటే ‘హిప్పీ’తో కుదిరింది. త్వరలోనే పాటలను విడుదల చేయనున్నాం’’ అన్నారు కలైపులి యస్‌.థాను. ఈ చిత్రానికి నివాస్‌ కె.ప్రసన్న సంగీతం అందించారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement