బాధలన్నీ పంటిబిగువనే భరించా : యువీ భార్య

Hazel Keech Emotional Post Over 10YearChallenge - Sakshi

మొన్నటిదాకా ఫిట్‌నెస్‌, కీకీ వంటి చాలెంజ్‌లతో ఇంటర్‌నెట్‌లో హల్‌చల్‌ చేసిన నెటిజన్లు ప్రస్తుతం #10ఇయర్స్‌చాలెంజ్‌ అనే సరికొత్త సవాల్‌తో సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగా పదేళ్ల క్రితం ఎలా ఉన్నాం, గతంతో పోలిస్తే ఇప్పుడు మనలో వచ్చిన మార్పులేంటి తదితర అంశాలను ఫొటోలతో సహా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయాలి. బాలీవుడ్‌ తారలు సోనమ్‌ కపూర్‌, బిపాసా బసు, శృతి హాసన్‌లు ఇప్పటికే ఈ చాలెంజ్‌ను స్వీకరించారు. నటి, క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ భార్య హాజిల్‌ కీచ్‌ కూడా ఈ జాబితాలో చేరారు.

ఉపవాసం ఉండేదాన్ని!
‘22 నుంచి 32 ఏళ్లు.. ఇంత దూరం ప్రయాణించానా! అప్పుడు డిప్రెషన్‌ను జయించేందుకు యుద్ధం చేసేదాన్ని, ఉపవాసం ఉండేదాన్ని,  జుట్టుకు చిక్కగా రంగేసుకునేదాన్ని. నా చుట్టూ ఉన్నవాళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇలాంటి పనులన్నీ చేసేదాన్ని. వారిని సంతోషంగా ఉంచేందుకు బాధలన్నీ పంటిబిగువనే భరించాను. కానీ ఈరోజు పూర్తి విశ్వాసంతో మాట్లాడగలను. ఎవరు ఏమనుకుంటారోనన్న భయం లేదు. ఇప్పుడు ధైర్యంగా జుట్టు కత్తిరించుకుంటున్నా. నా సంతోషం కోసమే నేను బతుకుతున్నా. ఇం‍త ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉంటానని ఎప్పుడూ కనీసం ఊహించలేదు. 10ఇయర్స్‌చాలెంజ్‌ మొదలుపెట్టిన వారికి కృతఙ్ఞతలు’ అంటూ హాజిల్‌ కీచ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్‌ చేశారు. దీంతో.. ‘భయాన్ని’ జయించిన మీలాంటి స్ఫూర్తిదాయక వ్యక్తులు మాకు ఆదర్శం’ అని నెటిజన్లు.. హాజిల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top