అందరూ మెచ్చుకునే జగన్నాయకుడు | Everyone liked jagannayakudu | Sakshi
Sakshi News home page

అందరూ మెచ్చుకునే జగన్నాయకుడు

Apr 4 2014 11:45 PM | Updated on Sep 2 2017 5:35 AM

అందరూ మెచ్చుకునే జగన్నాయకుడు

అందరూ మెచ్చుకునే జగన్నాయకుడు

‘‘గతంలో కృష్ణ, శ్రీదేవి జంటగా ‘భోగభాగ్యాలు’ సినిమా తీశాను. ఇన్నేళ్ల విరామం తర్వాత ఈ కథ నచ్చి ఈ సినిమా చేస్తున్నాను. మూడు తరాల కథ ఇది. రాజకీయ నేపథ్యం ఉండదు’’

‘‘గతంలో కృష్ణ, శ్రీదేవి జంటగా ‘భోగభాగ్యాలు’ సినిమా తీశాను. ఇన్నేళ్ల విరామం తర్వాత ఈ కథ నచ్చి ఈ సినిమా చేస్తున్నాను. మూడు తరాల కథ ఇది. రాజకీయ నేపథ్యం ఉండదు’’ అని నిర్మాత వి.ఎ. పద్మనాభరెడ్డి చెప్పారు. రాజా, సుమన్, భానుచందర్ కాంబినేషన్‌లో పి. చంద్రశేఖర్‌రెడ్డి దర్శకత్వంలో వట్లూరి శకుంతల రెడ్డి సమర్పణలో రూపొందుతోన్న ‘జగన్నాయకుడు’ పాటల సీడీని శుక్రవారం హైదరాబాద్‌లో తమ్మారెడ్డి భరద్వాజ్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ -‘‘ఈ నెల 25న చెన్నైలో నా వివాహం జరుగనుంది. 30న హైదరాబాద్‌లో రిసెప్షన్ జరుగుతుంది. ఈ సందర్భంగా ‘జగన్నాయకుడు’ పాటలు విడుదల కావడం ఆనందంగా ఉంది’’ అని తెలిపారు. ఇది అందరూ మెచ్చుకునే సినిమా అవుతుందని పి. చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. సినిమా బాగా వచ్చిందని భానుచందర్ చెప్పారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement