థ్రిల్‌ ఫుల్‌ | Dr. Chakravarti will be released on the 14th of this month. | Sakshi
Sakshi News home page

థ్రిల్‌ ఫుల్‌

Jul 3 2017 12:27 AM | Updated on Oct 22 2018 9:16 PM

థ్రిల్‌ ఫుల్‌ - Sakshi

థ్రిల్‌ ఫుల్‌

రిషి, సోనియా మాన్‌ జంటగా ‘ఎ ఫిల్మ్‌ బై అరవింద్‌’ ఫేమ్‌ శేఖర్‌ సూరి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘డాక్టర్‌ చక్రవర్తి’.

రిషి, సోనియా మాన్‌ జంటగా ‘ఎ ఫిల్మ్‌ బై అరవింద్‌’ ఫేమ్‌ శేఖర్‌ సూరి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘డాక్టర్‌ చక్రవర్తి’. శ్రీ వెంకటేశ్వర సూపర్‌మూవీస్‌ బ్యానర్‌పై ఆకుల వెంకటేశ్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది.

ఈ సందర్భంగా శేఖర్‌ సూరి మాట్లాడుతూ– ‘‘ఒక వాస్తవ సంఘటన ఆధారంగా చక్కని స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ ఇది. ఖర్చుకు వెనకాడకుండా ఎ. వెంకటేశ్‌ నిర్మించారు. విజయ్‌ కురాకుల మ్యూజిక్‌ ఈ సినిమాకు హైలైట్‌’’ అన్నారు. ‘సినిమా ఆద్యంతం ఉత్కంఠ రేకేత్తించేలా శేఖర్‌ సూరి అద్భుతంగా తెరకెక్కించారు. చిత్రం ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ‘ఎ ఫిల్మ్‌ బై అరవింద్‌’ చిత్రంలా ఈ సినిమా కూడా ఘనవిజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను’ అన్నారు ఎ. వెంకటేశ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement