‘అబూ సలీంకు, సోనూకు సంబంధాలు ఉన్నాయి’

Divya Khosla Kumar Said Abu Salem And Sonu Nigam Had Link - Sakshi

ముంబై: సింగర్‌ సోనూ నిగమ్‌కు, గ్యాంగ్‌స్టర్‌ అబూ సలీంకు మధ్య సంబంధాలు ఉన్నాయని దర్శకురాలు, నటి దివ్వ ఖోస్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సుశాంత్‌ ఆత్మహత్య అనంతరం బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలోనే కాకుండా సంగీత పరిశ్రమలో కూడా పెద్ద మాఫియా ఉందంటూ సోనూ నిగమ్‌ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతేగాక టీ-సీరిస్‌ యాజమానికి భూషణ్‌ కుమార్, అబూ సలీం నుంచి తనకు ప్రాణహానీ ఉందని అతడిని నుంచి రక్షించాలని వేడుకున్నాడంటూ ఇటీవల ట్వీట్‌ చేశాడు. (అతడు కృతజ్ఞత లేని వాడు: నటి)

దీంతో సోనూ నిగమ్‌ వ్యాఖ్యలను ఖండిస్తూ భూషణ్‌ కుమార్‌ భార్య దివ్వ ఖోస్లా సోషల్‌ మీడియాలో ‌గురువారం వీడియోను షేర్ చేశారు. ‘‘గత కొద్ది రోజులుగా సోనూ నిగమ్‌ టి-సిరీస్‌, యాజమాని భూషణ్‌‌ కుమార్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలు పెట్టాడు. పరిశ్రమలో సంబంధం లేని సంగీత దర్శకులకు, గాయకులకు, నటులకు, ప్రతిభ ఉన్న ఎంతోమంది బయట వ్యక్తులకు టీ-సిరీస్‌ సహాయపడింది. దర్శకురాలిగా నేను కొత్తవారికి అవకాశం ఇచ్చాను. వారిలో నలుగురు నేహా కక్కర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, హిమాన్ష్‌ కోహ్లి, స్వరకర్త ఆర్కో వృద్ది ఇప్పడు మంచి స్థాయికి ఎదిగారు’’ అంటూ చెప్పకొచ్చారు.  (ఆ మాఫియా ఇంకా పెద్దది: సోనూ నిగమ్‌)

అంతేగాక సోనూ నిగమ్‌ను ఉద్దేశిస్తూ.. ‘‘సోషల్‌ మీడియాలో నిజాలను దాచడం సులభమే. కానీ ఓ గాయకుడిగా మీరు ఎంతమంది కింది స్థాయి ప్రతిభావంతులను ముందుకు తీసుకువచ్చారో చెప్పండి. మీరు తప్ప మరెవరికి అవకాశం ఇవ్వలేదు. అలాంటి మీరు ఇప్పుడు మమ్మల్ని నిందిస్తున్నారా? వాస్తవానికి టీ-సిరీస్‌లో పనిచేసే 97 శాతం మంది బయటి వారే. వారికి పరిశ్రమలో ఎలాంటి సంబంధాలు లేవు. పరిశ్రమకు సంబంధించిన వ్యక్తుల పిల్లలు కూడా కాదు. మేము ఎప్పుడూ ప్రతిభ ఉన్న కొత్తవారి కోసమే చూస్తాము’’ అని చెప్పారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top