నాపై దాడి చేశారు: పూరి జగన్నాథ్ | director Puri Jagannadh filed a case against distributors | Sakshi
Sakshi News home page

నాపై దాడి చేశారు: పూరి జగన్నాథ్

Apr 17 2016 2:01 AM | Updated on Sep 27 2018 8:55 PM

నాపై దాడి చేశారు: పూరి జగన్నాథ్ - Sakshi

నాపై దాడి చేశారు: పూరి జగన్నాథ్

ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్‌పై దాడికి పాల్పడిన ముగ్గురు సినీ డిస్ట్రిబ్యూటర్లపై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

‘లోఫర్’ డిస్ట్రిబ్యూటర్లపై దర్శకుడు పూరి ఫిర్యాదు
కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు

 
హైదరాబాద్: ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్‌పై దాడికి పాల్పడిన ముగ్గురు సినీ డిస్ట్రిబ్యూటర్లపై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ సామల వెంకట్‌రెడ్డి వివరాలను మీడియాకు వెల్లడించారు. సి.కల్యాణ్ నిర్మాతగా పూరి జగన్నాథ్ దర్శకుడిగా ఇటీవల లోఫర్ సినిమా నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించి నైజాం, సీడెడ్, ఆంధ్రా హక్కులను అభిషేక్, సుధీర్, ముత్యాల రాందాస్ డిస్ట్రిబ్యూటర్లుగా కొనుగోలు చేశారు. ఈ సినిమా తీవ్ర నష్టాలు కలిగించడంతో తమ డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ఈ ముగ్గురు కలసి కొద్ది రోజుల నుంచి పూరిపై ఒత్తిడి తెస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఈ నెల 14వ తేదీ రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నం. 34లోని పూరి కార్యాలయానికి అభిషేక్, సుధీర్, రాందాస్ వచ్చి డబ్బులు ఇస్తావా ఇవ్వవా అంటూ బెదిరించడంతో పాటు ఆయనపై దాడికి పాల్పడ్డారు. శనివారం పూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన వారిపై జూబ్లీహిల్స్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 506, 452, 323, 452, 386, రెడ్‌విత్ 511 కింద కేసులు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు వెంకట్‌రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement