అందుకే తిరస్కరించారు: ప్రియదర్శన్‌

Director Priyadarshan Reveals Why Kartik Aaryan And Ayushmann Khurrana Rejected Hungama - Sakshi

హంగామా-2 కోసం బాలీవుడ్‌ హీరోలు ఆయుష్మాన్‌ ఖురానా, కార్తీక్‌ ఆర్యన్‌లను మొదట సంప్రదించగా వారు నిరాకరించినట్లు దర్శకుడు ప్రియదర్శన్‌ వెల్లడించారు. 2003లో కామెడీ నేపథ్యంలో రూపొందించిన ‘హంగామా’కు సీక్వెల్‌గా ‘హంగామా-2’ను ఆయన తెరకెక్కిస్తున్నారు. కాగా దీనికోసం ఆయుష్మాన్ ఖురానా, కార్తీక్ ఆర్యన్, సిద్దార్థ మల్హోత్రాలు వంటి పెద్ద హీరోలను సంప్రదించానని చెప్పారు. అయితే వారిలో ఎవరూ ఈ ప్రాజెక్ట్ పట్ల ఆసక్తి చూపలేదని కూడా పేర్కొన్నారు. తాను కాలం చెల్లిన దర్శకుడినని భావించే వారు తన ప్రాజెక్టును తిరస్కరించి ఉంటారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. (ఆ వీడియో డిలీట్‌ చేసిన హీరో..)

దీనిపై ఆయన ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. ‘నేను వారిని నేరుగా కలవలేదు కానీ అయుష్మాన్‌ ఖురానా, కార్తీక్‌ ఆర్యన్‌, సిద్దార్థ మల్హోత్రా వంటి పెద్ద హీరోలను దృష్టిలో పెట్టుకొనే ఈ కథ రాశాను. అయితే వారు ఈ ప్రాజెక్టును తిరస్కరించారు. బహుశా నేను అవుట్‌ డేటెడ్‌ డైరెక్టర్‌నని ఒప్పుకుని ఉండరు. ఎందుకంటే గత అయిదేళ్ల నుంచి నేను ఒక్క హిందీ సినిమాను కూడా తెరకెక్కించలేదు’ అని చెప్పుకొచ్చారు. అదే విధంగా ‘‘నా నమ్మకాన్ని విశ్వసించే నటులతోనే పని చేయడానికి నేను ఇష్టపడతాను. వారికి నాతో పని చేయడం ఇష్టం లేదని నిర్మోహమాటంగా చెప్పినప్పటికీ నటులను అభ్యర్థించడం నాకు ఇష్టం ఉండదు. నా మీద నమ్మకం ఉంచి నాతో నటించడానికి వచ్చిన వారితోనే నేను పనిచేస్తాను. ఎప్పుడైన మీరు నటులను నటించమని కోరితే వారికి మీ మీద నమ్మకం లేకపోతే అప్పుడు వారు గౌరవం ఇస్తూనే కాఫీ లేదా టీని అందించి మెల్లిగా మీ నుంచి తప్పించుకుంటారు’’ అని ఆయన చెప్పారు. 

కాగా హంగామా-2 సినిమా చిత్రీకరణపై ఆయన మాట్లాడుతూ.. సినిమా షూటింగ్‌ దాదాపు 80 శాతం పూర్తయిందని చెప్పారు. బాలీవుడ్‌ హీరోయిన్‌ శిల్పాశెట్టి, ప్రణితా సుభాష్‌లు నటిస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమా కోసం వారిని సంప్రదించినందుకు చాలా ఆనందంగా ఉందని కూడా ఆయన చెప్పారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top