ఇప్పుడు తమిళంలో... | Director Dhanush ropes in Nagarjuna, Sarathkumar and Aditi Rao Hydari for next film | Sakshi
Sakshi News home page

ఇప్పుడు తమిళంలో...

Sep 8 2018 12:41 AM | Updated on Jul 15 2019 9:21 PM

Director Dhanush ropes in Nagarjuna, Sarathkumar and Aditi Rao Hydari for next film - Sakshi

నాగార్జున

ప్రస్తుతం మల్టీస్టారర్‌ మోడ్‌లో ఉన్నట్లున్నారు నాగార్జున. ఆల్రెడీ తెలుగులో మల్టీస్టారర్‌ మూవీ ‘దేవదాస్‌’లో నటిస్తున్నారు. ఇందులో నాని మరో హీరో. హిందీలో ‘బ్రహ్మాస్త్ర’ అనే మల్టీస్టారర్‌ మూవీలో చేస్తున్నారు. నాగార్జునకు ఇందులో అమితాబ్, రణ్‌బీర్‌ కపూర్‌ కో–స్టార్స్‌. ఇప్పుడు తమిళంలో ధనుష్‌తో కలిసి నాగార్జున నటించనున్నారు. ఈ సినిమా పూజా కార్యక్ర మాలు జరిగాయి. ఇందులో నటించడంతో పాటు ధనుష్‌ దర్శకత్వం కూడా వహిస్తుండటం విశేషం. ‘పవర్‌ పాండీ’ సినిమా తర్వాత ధనుష్‌ దర్శకత్వంలో వస్తున్న సెకండ్‌ సినిమా ఇది. ఈ చిత్రాన్ని తేనాండాళ్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement