తెరపై హాట్‌టాపిక్... వంగవీటి రంగా | dhavala satyam new movie with MSR Creations banner | Sakshi
Sakshi News home page

తెరపై హాట్‌టాపిక్... వంగవీటి రంగా

Jan 11 2016 11:39 PM | Updated on Sep 3 2017 3:29 PM

తెరపై హాట్‌టాపిక్... వంగవీటి రంగా

తెరపై హాట్‌టాపిక్... వంగవీటి రంగా

నిజ జీవిత కథాంశాలకు, బయోపిక్‌లకు ప్రస్తుతం ఉత్తరాదినా, దక్షిణాదినా గిరాకీ. విజయవాడ కేంద్రంగా ఒకప్పుడు కోస్తా జిల్లాల రాజకీయాలను శాసించిన...

నిజ జీవిత కథాంశాలకు, బయోపిక్‌లకు ప్రస్తుతం ఉత్తరాదినా, దక్షిణాదినా గిరాకీ. విజయవాడ కేంద్రంగా ఒకప్పుడు కోస్తా జిల్లాల రాజకీయాలను శాసించిన స్వర్గీయ వంగవీటి రంగా నిజ జీవిత కథతో ధవళ సత్యం ఓ సినిమా చేయనున్నారు. ఆయన 28 ఏళ్ల క్రితం ఇలాంటి నేపథ్యంతోనే ‘చైతన్యరథం’ సినిమా చేశారు. కాగా, ఇప్పుడు తాజా చిత్రాన్ని రంగ మిత్ర మండలి సమర్పణలో ఎమ్‌ఎస్‌ఆర్ క్రియేషన్స్ పతాకంపై మంచాల సాయి సుధాకర్ నాయుడు నిర్మించనున్నారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘ఆంధ్రా రాబిన్‌హుడ్ లాంటి రంగా హత్యకు గురైనప్పుడు రాష్ట్రం అల్లకల్లోలమైంది. వాస్తవఘటనలతో చిత్రం నిర్మిస్తున్నాం. పూర్తి వివరాలను ఈ 23న విజయవాడలో తెలుపుతాం’’ అన్నారు.

‘‘రంగా సామాజిక వర్గానికి చెందిన ఓ పవర్‌ఫుల్ స్టార్‌తో ఆ పాత్ర చేయించడానికి ఒప్పిస్తున్నాం’’ అని నిర్మాత తెలిపారు. కాగా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఇప్పటికే ‘వంగవీటి’ అనే టైటిల్‌తో చిత్రం నిర్మిస్తున్నట్లు ప్రకటించడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement