‘మాల్తీ’గా ముంబైలో దీపిక చక్కర్లు

Deepika Padukone As Malti Visited Shops In Mumbai See What Happens - Sakshi

ముంబై: సాటి మనుషులను చూసే విధానం మారాలి అంటున్నారు బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనె. మేఘనా గుల్జార్‌ దర్శకత్వంలో దీపిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ఛపాక్‌. యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో దీపిక మాల్తీగా కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్‌ ప్రమోషన్‌ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఛపాక్‌తో తొలిసారిగా నిర్మాత అవతారమెత్తిన దీపిక... రియాలిటీ షోలకు హాజరవుతూ, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఛపాక్‌ ను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

ఇందులో భాగంగా యాసిడ్‌ దాడి బాధితులతో కలిసి ’ఛపాక్‌’సోషల్‌ ఎక్స్‌పెరిమెంట్‌ పేరిట దీపిక ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టారు. మాల్తీ మాదిరి మేకప్‌ చేసుకుని... యాసిడ్‌ దాడి బాధితుల పట్ల సమాజం వ్యవహరిస్తున్న తీరును కళ్లారా చూశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన దీపిక.. ‘ ఇలా ఓ రోజంతా గడిపిన తర్వాత.. కొన్ని నిజాలు మన ముందే ఉన్నా.. మనం వాటిని గుర్తించలేము. ఆలోచనా దృక్పథాన్ని మార్చుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. చూసే చూపుల్లో మార్పు రావాలి అని పేర్కొన్నారు. ఇక దీపిక షేర్‌ చేసిన వీడియోలో.. కొంతమంది యాసిడ్‌ బాధితులను ప్రేమ పూర్వకంగా పలకరించగా.. మరికొంత మంది మాత్రం వారిని వికారంగా చూసి చూపులు తిప్పుకోవడం గమనార్హం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top