రీ ఎంట్రీకి రెడీ!

Colours Swathi Re Entry With Karthikeya Sequal - Sakshi

బుల్లితెర నుంచి వెండితెర మీద అడుగుపెట్టిన అందాల భామ కలర్స్‌ స్వాతి. హీరోయిన్‌ గా పెద్దగా సక్సెస్‌ కాలేకపోయినా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ పూర్తిగా గాడిలో పడకముందే పెళ్లి చేసేసుకోవటంతో స్వాతి సినిమాలకు గుడ్‌బై చెప్పేస్తుందని భావించారు. తరువాత ఒకటి రెండు ఇంటర్వ్యూలలో రీ ఎంట్రీ గురించి ప్రస్తావించినా సీరియస్‌గా అలాంటి ప్రయత్నాలు చేయకపోవటంతో ఇక కెరీర్‌ ముగినట్టే అని భావించారు.

అయితే తాజాగా కలర్స్‌ స్వాతి రీ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. స్వాతి కెరీర్‌లో మంచి విజయం సాధించిన కార్తీకేయ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలో సెట్స్‌ మీదకు వెళ్లనున్న ఈ సినిమాతోనే స్వాతి రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మరి రీ ఎంట్రీలో అయిన స్వాతి స్టార్ ఇమేజ్‌ అందుకుంటుందేమో చూడాలి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top