ఆ రాత్రి బెదిరిపోయా.. ఇప్పుడు ఓకే: బ్రిట్నీ స్పియర్స్ | Britney Spears 'ok' after stage mishap | Sakshi
Sakshi News home page

ఆ రాత్రి బెదిరిపోయా.. ఇప్పుడు ఓకే: బ్రిట్నీ స్పియర్స్

May 1 2015 8:42 AM | Updated on Sep 3 2017 1:14 AM

చీలమండ గాయం బాధపెడుతున్నా కో డ్యాన్సర్స్  సహాయంతో సాంగ్ పెర్ఫామ్ చేస్తోన్న బ్రిట్నీ స్పియర్స్

చీలమండ గాయం బాధపెడుతున్నా కో డ్యాన్సర్స్ సహాయంతో సాంగ్ పెర్ఫామ్ చేస్తోన్న బ్రిట్నీ స్పియర్స్

గుండెలు అవిసిపోయేలా తనకోసం ప్రార్థనలు చేస్తోన్న అభిమానులందరికీ పాప్ క్వీన్ బ్రిట్నీ స్పియర్స్ చల్లని కబురు చెప్పింది.

గుండెలు అవిసిపోయేలా తనకోసం ప్రార్థనలు చేస్తోన్న అభిమానులందరికీ పాప్ క్వీన్ బ్రిట్నీ స్పియర్స్ చల్లని కబురు చెప్పింది. గత బుధవారం లాస్ ఏంజిల్స్లోని ఓ క్యాసినోలో పెర్ఫార్మ్ చేస్తూ ఒక్కసారిగా తూలిపడటంతో కాలి చీలమండ పట్టేసింది. పాట మధ్యలో ఈ ప్రమాదం జరిగినప్పటికీ లక్షల డాలర్లు చెల్లించిన నిర్వాహకుల్ని, తన షో చూడటం కోసం వచ్చిన అభిమానుల్ని నిరాశపర్చకుండా.. తీవ్రమైన బాధను భరిస్తూ కో- డ్యాన్సర్స్ సహాయంతో బ్రిట్నీ స్పియర్ షో పూర్తి చేసింది. షో  అయిపోయిన వెనువెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.

 

ప్రస్తుతం బ్రిట్నీ ఆరోగ్య పరిస్థితి బాగుందని, కొన్ని రోజులవరకు డ్యాన్స్ చేయకుండా ఉంటే మంచిదని డాక్టర్లు చెప్పారు. 'నేను కోలువాలని కోరుకున్న మీ అందరికీ థ్యాంక్స్. నిజానికి కింద పడిపోయిన ఆ రాత్రి నేను ఎంతగానో బెదిరిపోయాను. యాంకిల్ దెబ్బతింది. కానీ ఇప్పుడు ఓకే' అంటూ శుక్రవారం ట్విట్టర్ లో తన క్షేమ సమాచారాన్ని పోస్ట్ చేసింది. బ్రిట్నీ స్టేజ్ పైన కిందపడటం ఇది తొలిసారేంకాదు. గత నెల మార్చిలోనూ ఇలాంటి ప్రమాదమే జరిగింది అయితే అప్పుడామెకు గాయాలేవీ కాలేదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement