బ్యాక్‌ ఫ్రమ్‌ బ్యాంకాక్‌ | Boyapati,Srinivas 2nd Schedule Completed in Bangkok | Sakshi
Sakshi News home page

బ్యాక్‌ ఫ్రమ్‌ బ్యాంకాక్‌

Feb 25 2017 1:11 AM | Updated on Aug 3 2019 12:45 PM

బ్యాక్‌ ఫ్రమ్‌ బ్యాంకాక్‌ - Sakshi

బ్యాక్‌ ఫ్రమ్‌ బ్యాంకాక్‌

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రకుల్‌ప్రీత్‌ సింగ్, ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్లు. బ్యాంకాక్‌లో సెకండ్‌ షెడ్యూల్‌ను అనుకున్న టైమ్‌ కంటే ఒక్క రోజు ముందే పూర్తి చేశామని రవీందర్‌రెడ్డి తెలిపారు.

‘‘30 రోజుల పాటు బ్యాంకాక్‌లో హీరో హీరోయిన్లతో పాటు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న జగపతిబాబు, శరత్‌కుమార్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. బోయపాటి ప్లానింగ్, ఆర్టిస్టుల సహకారంతో ఒక్క రోజు ముందే షెడ్యూల్‌ పూర్తయింది’’ అని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి మాటలు: ఎం. రత్నం, కెమేరా: రిషి పంజాబీ, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement