ఆ కళాకారుడికి బాలీవుడ్‌ సింగర్‌ సాయం..

Bollywood Singer Badshah Gives Five Lakh Rupees To Folk Artiste Ratan Kahar - Sakshi

బాలీవుడ్‌ సింగర్‌ బాద్‌షా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ‘బోరోలోక‌ర్ బీటీ లో’ పాట సృష్టికర్త, బెంగాల్ జాన‌ప‌ద క‌ళాకారుడు ర‌త‌న్ క‌హార్‌కు ఆర్థిక సాయం అందిస్తానని పేర్కొన్న విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం బాద్‌షా తన టీంతో ఆ కళాకారుడుకి వీడియో కాల్‌​ చేసి అకౌంట్‌ వివరాలు తెలుసుకున్నాడు. అనంతరం అతని ఖాతాలో రూ. 5లక్షలు జమ చేసి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నాడు. బాద్‌షా చేసిన సాయంపై రతన్‌ కహార్‌ స్పందించారు.

‘బాద్‌షా చేసిన సాయానికి కృతజ్ఞతలు. పశ్చిమ బెంగాల్‌లోని బిర్భుమ్ జిల్లా శౌరి గ్రామంలో ఉండే నా ఇంటికి బాద్‌షా రావాల’ని ఆయన ఆహ్వానించారు. ఇక తన పాటను ఆల్బమ్‌లో ఉపయోగించుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా బాద్‌షాతో సంగీతానికి సంబంధించిన పలు విషయాలు చర్చించాలని ఎదురు చూస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం రతన్‌ కహార్‌ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలిసిందే. (‘దారుణం, అత‌డి ప్ర‌తిభ‌ను కొట్టేశారు’)

హీరోయిన్ జాక్వ‌లిన్ ఫెర్నాండేజ్‌, సింగ‌ర్ బాద్‌షా క‌లిసి ఆడిపాడిన మ్యూజిక్ ఆల్బ‌మ్ ‘జెండా ఫూల్’ ఈ మ‌ధ్యే రిలీజ్ అయింది. ఈ పాట మూలాలు రతన్‌ కహార్‌ ‘బోరోలోకర్‌ బీటీ లో’తో దగ్గరగా ఉన్నాయని, కనీసం ఆ కళాకారుడికి గుర్తింపు ఇవ్వకపోవటంపై సోషల్‌మీడియాలో నెటిజన్లు బాద్‌షాపై తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top