సావిత్రి పాత్రను వదిలేశారు ఎందుకో తెలుసా? | Biography of savitri | Sakshi
Sakshi News home page

సావిత్రి పాత్రను వదిలేశారు ఎందుకో తెలుసా?

Dec 18 2016 1:15 AM | Updated on Sep 4 2017 10:58 PM

సావిత్రి పాత్రను వదిలేశారు ఎందుకో తెలుసా?

సావిత్రి పాత్రను వదిలేశారు ఎందుకో తెలుసా?

నటనకు భాష్యం చెప్పిన నటి సావిత్రి. ఎంజీఆర్, శివాజీగణేశన్, జెమినీగణేశన్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌ వంటి నట దిగ్గజాలకు దీటుగా నటించి ఖ్యాతి గడించిన మహానటి సావిత్రి.

నటనకు భాష్యం చెప్పిన నటి సావిత్రి. ఎంజీఆర్, శివాజీగణేశన్, జెమినీగణేశన్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌ వంటి నట దిగ్గజాలకు దీటుగా నటించి ఖ్యాతి గడించిన మహానటి సావిత్రి. ఆ నటవిశారదకు సాటి లేరు. ఇప్పుడు ఆమె జీవిత చరిత్ర తెరకెక్కనున్న విషయం తెలిసిందే. తమిళం, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్‌ నిర్మించనున్నట్లు సమాచారం. నాగ్‌అశ్విన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో సావిత్రి పాత్రను నటి సమంత నటించడానికి ముందుకు వచ్చారు. సావిత్రి లాంటి గొప్ప నటి పాత్రలో నటించడం అదృష్టం అని కూడా వెల్లడించిన సమంత అనూహ్యంగా ఆ చిత్రం నుంచి వైదొలిగారు. కారణం ఆహార్యమే.

సావిత్రి తొలి రోజుల్లో చాలా లావుగా ఉండేవారు. ఆ తరువాత బరువు తగ్గి నాజూగ్గా తయారయ్యారు. అదే విధంగా సమంతను బరువు పెరువు పెరగాల్సిందిగా దర్శక నిర్మాతలు కోరారట. ఇప్పటికే నాగచైతన్యతో పెళ్లికి సిద్ధం అవుతున్న సమంత అదే విధంగా తన కొత్త చిత్రాలకు బరువు పెరగడం వల్ల సమస్యలు తలెత్తుతాయని భయపడి ఆ చిత్రాన్నే వదిలేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే అందాల నటి అనుష్క ఇంజి ఇడుప్పళగి చిత్రం కోసం భారీగా బరువు పెంచి, ఆ తరువాత బాహుబలి–2 చిత్రం కోసం బరువు తగ్గలేక నానా తంటాలు పడిన విషయం తెలిసిందే. ఇవన్నీ ఆలోచించిన సమంత సావిత్రి పాత్ర నుంచి వైదొలిగినట్లు సమాచారం. ఇప్పుడు సావిత్రి పాత్ర కోసం నటి నిత్యామీనన్ సీన్ లోకి వచ్చినట్లు తెలిసింది.ఆమెను ఎంపిక చేసే విషయం గురించి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement