బిగ్‌బాస్‌.. ద వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌ | Bigg Boss Season 3 Starting On 21 July | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌.. ద వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌

Jul 21 2019 4:46 PM | Updated on Jul 26 2019 7:22 PM

Bigg Boss Season 3 Starting On 21 July - Sakshi

ఓ వైపు వివాదాలు.. మరోవైపు నినాదాలు.. ఇంకోవైపు ధర్నాలు, నిరసనలు.. బిగ్‌బాస్‌ను చుట్టుముట్టాయి. మూడో సీజన్‌ను మొదలుపెట్టకముందే తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.  జర్నలిస్ట్‌ శ్వేతారెడ్డి, గాయత్రీ గుప్తాలు బిగ్‌బాస్‌పై ఆరోపణలు చేయడం, కేసులు పెట్టడం.. ఆఖరికి దేశ రాజధానిలో ధర్నాకు దిగడంతో షో మొదలవ్వకముందే మంచి హైప్‌ క్రియేట్‌ అయింది. అయితే ఓ దశలో బిగ్‌బాస్‌ వాయిదా పడనుందని వార్తలు వినిపించినా.. ఎట్టకేలకు బిగ్‌బాస్‌ వచ్చేస్తున్నాడు. హౌస్‌లో ఆర్డర్స్‌ వేసే బిగ్‌బాస్‌ను ఎవరూ ఆపలేరని.. చెప్పిన సమయానికి వచ్చేందుకు రంగం సిద్దమైంది.

గత రెండు సీజన్లను మించి ఈ మూడో సీజన్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్‌ హోస్ట్‌ చేసిన మొదటి సీజన్‌ బంపర్‌ హిట్‌ అవ్వగా.. రెండో సీజన్‌ను నడిపించడంలో నాని కాస్త తడబడ్డాడు. అయితే రెండో సీజన్‌లో కౌశల్‌ ఆర్మీ పుణ్యమా అంటూ షోకు ఎనలేని క్రేజ్‌ ఏర్పడింది. అయితే ఈ మూడో సీజన్‌ను మాత్రం పక్కా ప్లాన్‌తో సూపర్‌హిట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే కింగ్‌ నాగార్జునను హోస్ట్‌గా ఎంపిక చేశారు. బుల్లితెరపై సందడి చేసిన అనుభవం ఉన్న నాగ్‌.. ఈ రియాల్టీ షోను కూడా సక్సెస్‌ చేస్తాడని అందరూ అనుకుంటున్నారు.

హోస్ట్‌ విషయంలో అధికారికంగా ప్రకటించిన స్టార్‌ మా బృందం.. కంటెస్టెంట్ల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంది. చివరి వరకు కంటెస్టెంట్స్‌ లిస్ట్‌ లీక్‌ కాకుడదని పకడ్బందీగా నిర్వహిస్తోంది. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం వీటికి సంబంధించిన లీకులు ఆగడం లేదు. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంటరయ్యే 15మంది కంటెస్టెంట్లు వీరేనంటూ ఓ లిస్ట్‌ చక్కర్లు కొడుతోంది. రెండో సీజన్‌లో కామన్‌ మ్యాన్‌గా ఎంటరైన నూతన్‌ నాయుడు కూడా ఓ లిస్ట్‌ను సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు. వంద రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే వారంటూ.. తీన్మార్‌ సావిత్రి, జర్నలిస్టు జాఫర్‌, యాంకర్‌ శ్రీముఖి, నటీమణులు హేమ, హిమజ, ఉయ్యాల జంపాల ఫేం పునర్ణవి భూపాలం, వరుణ్‌ సందేశ్‌, అతడి భార్య వితికా షేరు, సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌, భరణి, దుర్గ, అషూరెడ్డి(డబ్‌స్మాష్‌ స్టార్‌), రఘు మాస్టర్‌‌, ఫన్‌ బకెట్‌ మహేష్‌ విట్టా, అలీ రెజా, రవికృష్ణ లాంటి కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. మరి వీరందరిలో ఎంతమంది హౌస్‌లోకి వెళ్లనున్నారో మరికొన్ని గంటల్లో తేలనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement