బిగ్‌బాస్‌ : సల్మాన్‌కు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్‌.. | Bigg Boss Makers To Pay Salman Khan Rs Two Crore | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ : సల్మాన్‌కు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్‌..

Nov 27 2019 8:08 AM | Updated on Nov 27 2019 8:12 AM

Bigg Boss Makers To Pay Salman Khan Rs Two Crore - Sakshi

బిగ్‌బాస్‌ షో పొడిగించడంతో సల్మాన్‌ ఖాన్‌కు అదనపు రెమ్యూనరేషన్‌గా భారీ మొత్తం దక్కింది.

ముంబై : వివాదాస్పద విషయాలతో ప్రాచుర్యం పొందే హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌ 13 మరోసారి వార్తల్లో నానుతోంది. ఈ షోను హోస్ట్‌ చేస్తున్న కింగ్‌ ఖాన్‌ సల్మాన్‌ పారితోషికం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ ఏడాది డిసెంబర్‌తో ముగియాల్సిన బిగ్‌బాస్‌ 13ను మరో ఐదు వారాలు పొడిగించారు. బిగ్‌బాస్‌ను షెడ్యూల్‌ ప్రకారం ముగించి రాధే సెట్స్‌పై అడుగుపెట్టాలని ప్లాన్‌ చేసుకున్న బాలీవుడ్‌ కండలవీరుడు తాను షోలో పాల్గొనలేనని తేల్చిచెప్పారు. అయితే పొడిగించిన అయిదు వారాలకు భారీ పారితోషికాన్ని ఆఫర్‌ చేయడంతో సల్మాన్‌ మెత్తబడినట్టు సమాచారం.

షోను అయిదు వారాల పాటు పొడిగించడంతో ఈ ఎపిసోడ్స్‌ వరకూ రూ 2 కోట్టు సల్మాన్‌కు ముట్టచెప్పేందుకు నిర్వాహకులు ముందుకొచ్చారు. దబంగ్‌ 2 పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు, రాధే షూటింగ్‌ వంటి కమిట్‌మెంట్స్‌తో బిగ్‌బాస్‌ ఎక్స్‌టెన్షన్‌లో పాల్గొనలేనని సల్మాన్‌ చెప్పినా నిర్వాహకులు ఊరించే పారితోషికంతో ఆయనను షోలో ఎంగేజ్‌ చేశారు. ప్రతి సీజన్‌లోనూ సల్మాన్‌ రెమ్యూనరేషన్‌ను విపరీతంగా పెంచేస్తుడటంతోనే సల్మాన్‌ బిగ్‌బాస్‌ను హోస్ట్‌ చేసేందుకు అంగీకరిస్తున్నారు. ప్రాంతీయ భాషల్లో బిగ్‌బాస్‌ హోస్ట్‌ల కంటే అధిక మొత్తంలో బాలీవుడ్‌ కండలవీరుడు ఈ షో నుంచి రాబడుతున్నారు. రెమ్యూనరేషన్‌ను భారీ రేంజ్‌లో ముట్ట చెప్పడంతో షో నిర్వాహకులు ఇక ఈ షోకు హై రేటింగ్స్‌ సాధించే పనిలో పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement