‘రాక్షసుడు’గా బెల్లంకొండ | Bellamkonda Sai Sreenivas And Ramesh Varma Movie Title Rakshasudu | Sakshi
Sakshi News home page

‘రాక్షసుడు’గా బెల్లంకొండ

Apr 4 2019 10:15 AM | Updated on Apr 4 2019 10:15 AM

Bellamkonda Sai Sreenivas And Ramesh Varma Movie Title Rakshasudu - Sakshi

కోలీవుడ్ లో సూపర్‌ హిట్ అయిన థ్రిల్లర్‌ మూవీ రాక్షసన్‌. విష్ణు విశాల్‌, అమలాపాల్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో రీమేక్‌చేసే ఆలోచనలో ఉన్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. ఈ సినిమాకు రైడ్‌, వీర చిత్రాల ఫేం రమేష్‌ వర్మ దర్శకత్వం వహించనున్నాడు.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు ‘రాక్షసుడు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. కథా కథనాల పరంగా ఈ టైటిల్‌ పర్ఫెక్ట్ అన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలోవెల్లడించనున్నారు.

మీడియం రేంజ్‌ సినిమాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో సీత సినిమాలో నటిస్తున్న బెల్లంకొండ, ఆర్‌ఎక్స్‌ 100 ఫేం అజయ్‌ భూపతి దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు. ఈ సినిమాతో పాటే రాక్షసన్‌ రీమేక్‌లో నటించేందుకు బెల్లంకొండ ఓకే చెప్పాడు. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన సీత సినిమా  పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ఈ నెలలోనే సినిమాను రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement