మరో ప్రయోగం | Ayushmann Khurrana is Shubh Mangal Zyada Saavdhan goes on floors | Sakshi
Sakshi News home page

మరో ప్రయోగం

Sep 14 2019 3:33 AM | Updated on Sep 14 2019 3:33 AM

Ayushmann Khurrana is Shubh Mangal Zyada Saavdhan goes on floors - Sakshi

ఆయుష్మాన్‌ ఖురానా

గత ఏడాది ‘అంధాథూన్‌’, ‘బదాయి హో’ వంటి ప్రయోగాత్మకమైన సినిమాలు చేసి బాలీవుడ్‌లో క్రేజీ హీరోగా మారారు ఆయుష్మాన్‌ ఖురానా. తాజాగా స్వలింగ సంపర్కం అంశంతో కూడిన సినిమాలో హీరోగా నటించడానికి అంగీకరించారు. ఈ చిత్రానికి ‘శుభ్‌ మంగళ్‌ జ్యాదా సావధాన్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ సినిమాతో హితేష్‌ కేవల్యాస్‌ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నీనా గుప్తా, గిరి రాజ్‌ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 13న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ ఏడాది ‘ఆర్టికల్‌ 15’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయుష్మాన్‌ ‘డ్రీమ్‌గాళ్, బాల, గులాబో సీతాబో’ వంటి చిత్రాల్లో నటించారు.   ‘బాల’ నవంబర్‌లో, ‘గులాబో’.. వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement