వంద సినిమాల్లో ఒకటిలా ఉండదు | Arjun, Vijay Anthony's Killer Pre release event | Sakshi
Sakshi News home page

వంద సినిమాల్లో ఒకటిలా ఉండదు

Jun 6 2019 3:32 AM | Updated on Jun 6 2019 3:32 AM

Arjun, Vijay Anthony's Killer Pre release event - Sakshi

ఆండ్రూ, విజయ్‌ ఆంటోని, ఆషిమా, సైమన్, శ్రీధర్, సజ్జు

‘‘కళకు భాషతో సంబంధం లేదని మళ్లీ మళ్లీ నిరూపిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. అందర్నీ ఆదరిస్తారు. ఈ సినిమా కూడా బాగుంది.. పెద్ద హిట్‌ అవుతుంది.. మళ్లీ సక్సెస్‌ మీట్‌లో తప్పకుండా కలుద్దాం’’ అన్నారు విజయ్‌ ఆంటోని. అర్జున్, విజయ్‌ ఆంటోని హీరోలుగా, ఆషిమా నర్వాల్‌ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘కొలైగారన్‌’. ఆండ్రూ లూయిస్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని టి.నరేష్‌కుమార్‌–టి.శ్రీధర్‌ ‘కిల్లర్‌’ పేరుతో తెలుగులో రేపు విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో నిర్మాత ప్రదీప్‌ మాట్లాడుతూ– ‘‘విజయ్‌ ఆంటోని, అర్జున్‌.. తమ నటనతో ఆకట్టుకున్నారు.

కథ చాలా బాగుంటుంది. అందుకే తెలుగులో విడుదల చేస్తున్నాం. ఇంట్రెస్టింగ్‌ అంశాలు, ఉత్కంఠ పరిచే సన్నివేశాలు చాలా ఉన్నాయి’’ అన్నారు. ‘‘ఈ సినిమాతో తమిళంలోకి హీరోయిన్‌గా పరిచయమవుతున్నందుకు ఆనందంగా ఉంది. ఎప్పటికైనా సావిత్రిగారంత పెద్ద హీరోయిన్‌ అవ్వాలన్నదే నా లక్ష్యం’’ అన్నారు ఆషిమా నర్వాల్‌. ‘‘ఇది నా మొదటి తెలుగు సినిమా. పాటలకు ఇంత మంచి స్పందన ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు సంగీత దర్శకుడు సైమన్‌ కె. కింగ్‌. ‘‘వంద సినిమాల్లో ఒక సినిమాలా ‘కిల్లర్‌’ ఉండదు.. వంద సినిమాలకు ఒక సినిమాలా ఉంటుంది’’ అని చిత్ర రచయిత భాషా శ్రీ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement