బాలీవుడ్‌ భీష్మ

Arjun Kapoor grabs Hindi remake of Bheeshma - Sakshi

‘భీష్మ: ది బ్యాచిలర్‌’ తెలుగు ప్రేక్షకులను బాగా నవ్వించాడు. అందుకే బాలీవుడ్‌లోనూ రీమేక్‌ కాబోతున్నాడు. నితిన్, రష్మిక జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీష్మ’. ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం నితిన్‌ కెరీర్లో భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా హిందీలో రీమేక్‌ కానుంది. ఈ రీమేక్‌లో రణ్‌బీర్‌ కపూర్‌ యాక్ట్‌ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ బాలీవుడ్‌ ‘భీష్మ’ కన్‌ ఫర్మ్‌ అయ్యారట. ఈ సినిమాలో హీరోగా అర్జున్‌ కపూర్‌ నటించబోతున్నారు అని తాజా సమాచారం. ఈ సినిమాకు  దర్శకుడు ఎవరు అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top