మా బంధం సినిమాలా కాదు | anjelina jolie couple rejected by the sea film | Sakshi
Sakshi News home page

మా బంధం సినిమాలా కాదు

Nov 1 2015 12:02 PM | Updated on Sep 3 2017 11:50 AM

మా బంధం సినిమాలా కాదు

మా బంధం సినిమాలా కాదు

హాలీవుడ్ స్టార్స్ ఎంత త్వరగా ఒక్కటవుతారో అంతే త్వరగా విడిపోతారు. అయితే హాలీవుడ్ సూపర్ స్టార్ ఏంజెలినా జూలీ మాత్రం ఇందుకు మినహాయింపు.

హాలీవుడ్ స్టార్స్ ఎంత త్వరగా ఒక్కటవుతారో అంతే త్వరగా విడిపోతారు. అయితే హాలీవుడ్ సూపర్ స్టార్ ఏంజెలినా జూలీ మాత్రం ఇందుకు మినహాయింపు. తన యాక్షన్ ఇమేజ్తో పాటు సోషల్ యాక్టివిటీస్తో కూడా ఎప్పుడు వార్తల్లో ఉండే హాలీవుడ్ ముద్దుగుమ్మ ఫ్యామిలీ రిలేషన్స్ విషయంలో కూడా చాలా ఫర్ఫెక్ట్గా ఉంటుంది. తన సహనటుడు బ్రాడ్పిట్ను పెళ్లాడిన ఈ బ్యూటి అతనితో ఎలాంటి సమస్యలు లేకుండా ఎంతో అన్యోన్యంగా ఉంటోంది.

ఇప్పటికీ సినిమాల్లో నటిస్తున్న ఈ జంట ఇటీవల ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో కలిసి నటించింది. పెళ్లి తరువాత ఇద్దరు దంపతుల మధ్య వచ్చే సమస్యల నేపధ్యంలో ఓ సినిమాను తెరకెక్కించారు.  బై ద సీ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఏంజెలినా జోడి కలిసి నటించటమే కాదు ఆ సినిమాను జోలి దర్శకత్వంలో తమ సొంతం నిర్మాణ సంస్థ ద్వారా తెరకెక్కించారు. అయితే ఇటీవల రిలీజ్ అయిన సినిమా ట్రైలర్ లో భార్య భర్తల మధ్య చూపించిన సన్నివేశాలన మాధిరిగా కాకుండా, వ్యక్తిగతంగా తమ రిలేషన్ ఎంతో ఆనందంగా సాగుతుందని జోలి వివరణ ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement