‘ఆ విషయంలో కరీనానే బెస్ట్‌’

Anand Ahuja Says Kareena Kapoor Is Bollywood Fashion Icon - Sakshi

బాలీవుడ్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌ అనగానే ప్రస్తుతం చాలా మందికి గుర్తొచ్చే పేరు సోనమ్‌ కపూర్‌. తాజాగా కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ఫ్యాషన్‌ దివా అంటే సోనమే అనేంతగా లుక్స్‌తో ఆకట్టుకున్నారు కూడా. అయితే ఫ్యాషన్‌ విషయంలో సోనమ్‌ కంటే కూడా కరీనా కపూరే ది బెస్ట్‌ అనే స్టేట్‌మెంట్‌ సోనమ్‌ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. కానీ ఆ స్టేట్‌మెంట్‌ ఇచ్చిన వ్యక్తిపై వారు తమ ఆగ్రహాన్ని బాహాటంగా వెళ్లగక్కలేకపోతున్నారు. ఎందుకంటే ఆ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది మరెవరో కాదు... సోనమ్‌ కపూర్‌ భర్త ఆనంద్‌ అహుజా.

ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..బాలీవుడ్‌ స్టైల్‌ ఐకాన్‌ అంటే తనకు కరీనా కపూరే గుర్తుకువస్తుందని ఆనంద్‌ పేర్కొన్నారు. ‘కరీనా కపూర్‌ మోస్ట్‌ స్టైలిస్ట్‌ వుమన్‌... ఇటీవల లండన్‌ వెకేషన్‌లో భాగంగా ఆమెను దగ్గరగా చూసే అవకాశం కలిగింది. మేకప్‌ లేకుండా కూడా ఆమె చాలా స్టైలిష్‌ లుక్స్‌తో ఆకట్టుకున్నారు. సో.. నేనైతే ఫ్యాషన్‌ విషయంలో కరీనానే బెస్ట్‌ అని  చెబుతానని, అలా సోనమ్‌ని తక్కువ చేసి మాట్లాడటం తన ఉద్దేశం కాదని’  ఆనంద్‌ వ్యాఖ్యానించారు. కాగా ఫ్యాషన్‌ పట్ల ఇద్దరికి ఉన్న ఆసక్తే తమను ఒక్కటి చేసిందని, ఆనంద్‌ను వివాహం చేసుకోవడానికి అది కూడా ఒక కారణమని ఇటీవలే సోనమ్‌ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం భర్త ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు ఆమె ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి మరి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top