సూపర్‌స్టార్‌తో నటించాలనుంది! | Amyra Dastur Wants To Act With Rajinikanth | Sakshi
Sakshi News home page

May 20 2018 8:44 AM | Updated on Apr 8 2019 7:50 PM

Amyra Dastur Wants To Act With Rajinikanth - Sakshi

సాక్షి, చెన్నై : సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు జంటగా నటించాలని ఆశ పడుతున్న హీరోయిన్ల జాబితాలో తాజాగా మరో బ్యూటీ చేరింది. బాలీవుడ్‌ అమ్మడు అమిరా దస్తర్‌ ఇప్పటికే కోలీవుడ్‌ ప్రేక్షకులకు అనేగన్‌ చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ చిత్రం హిట్‌ అయినా ఈ అమ్మడు ఇక్కడ మళ్లీ కనిపించలేదు. అలాంటిది తాజాగా మరోసారి యువ నటుడు జీవీ.ప్రకాశ్‌కుమార్‌తో కలిసి తమిళప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది. అవును ఈ జంట ఇప్పుడు 3డీ ఫార్మెట్‌లో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నారు. అయితే మలి చిత్రంతోనే పలు కండిషన్లు విధిస్తోందన్న విమర్శలను ఈ జాణ ఎదుర్కొంటోంది.

అదే విధంగా అమిరా దస్తూర్‌కు కాస్త టెక్‌ ఎక్కువనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇక అలాంటి విషయాలను పక్కన పెడితే మీకు ఇష్టమైన హీరో, హీరోయిన్‌ ఎవరన్న ప్రశ్నకు అమిర దస్తూర్‌ ఇలా చెప్పుకొచ్చింది. నటి ఐశ్వర్యారాయ్, విద్యాబాలన్‌ నాకు రోల్‌ మోడల్‌ అని చెప్పింది. ఎందుకంటే వారిద్దరూ అంతర్జాతీయ స్థాయిలో సినిమాకు చిరునామాగా నిలిచారు అని పేర్కొంది. వివాహానంతరం కథానాయికలుగా దుమ్మురేపుతున్నారు కూడా అని అంది. వారి మార్కెట్, క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదని అంది. నటి విద్యాబాలన్‌ అయితే ఇటు కమర్శియల్‌గానై, అటు విమర్శనాత్మక కథా చిత్రాల్లోనూ రాణిస్తున్నారని అన్నారు.

హీరోయిన్లు అంటే అలా ఉండాలని అంది. అదే విధంగా అమీర్‌ఖాన్, హృతిక్‌రోషన్‌ల చిత్రాలను విడుదలైన మొదటి రోజే చూస్తానని చెప్పింది. వారంటే తనకంత ఇష్టం అని పేర్కొంది. ఇక కోలీవుడ్‌లో ధనుష్‌ అంటే చాలా ఇష్టం. ఆయనతో ఇప్పటికే నటించానని, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో ఒక్క చిత్రంలో చిన్న వేషం అయినా చేయాలని కోరుకుంటున్నానని అమిర దస్తూర్‌ అంది. అదే విధంగా నటుడు విక్రమ్‌ అన్నా తనకు ఇష్టం అని చెప్పుకొచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement