డిజిటల్‌ ఎంట్రీ

Amala Paul goes BOLD once again after Aame - Sakshi

ఎటువంటి పాత్రలోనైనా ఒదిగిపోగలరు నటి అమలాపాల్‌. ఇటీవల ‘ఆమె’ సినిమాలో అమల ఎంత బోల్డ్‌గా నటించారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తాజాగా అటువంటి బోల్డ్‌ పాత్రలోనే మరోసారి నటిస్తున్నారట ఆమె. హిందీ ఆంథాలజీ ‘లస్ట్‌ స్టోరీస్‌’ తెలుగులో కూడా రూపొందనుంది. హిందీలో నిర్మించిన రోనీ స్క్రూవాలాయే తెలుగులోనూ నిర్మిస్తున్నారట. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. ఓ భాగంలో నటి అమలాపాల్‌ నటిస్తుండగా, ‘ఓ బేబి’ ఫేమ్‌ నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారని టాక్‌. జగపతిబాబు ఓ కీలక పాత్రధారి. ఈ ఆంథాలజీలోని మిగిలిన విభాగాలకు సందీప్‌రెడ్డి వంగా, సంకల్ప్‌ రెడ్డి, తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారని సమాచారం. కాగా అమలా పాల్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో నటిస్తుండటం ఇదే తొలిసారి కావడం విశేషం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top