తొలిసారి రిపీట్ చేస్తున్న అల్లు అర్జున్ | Allu Arjun Pair with Shruti Haasan | Sakshi
Sakshi News home page

తొలిసారి రిపీట్ చేస్తున్న అల్లు అర్జున్

Jul 6 2016 2:24 PM | Updated on Sep 4 2017 4:16 AM

తొలిసారి రిపీట్ చేస్తున్న అల్లు అర్జున్

తొలిసారి రిపీట్ చేస్తున్న అల్లు అర్జున్

అయితే ఈ సినిమా కోసం తన కెరీర్ స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్న ఓ రూల్ను బ్రేక్ చేస్తున్నాడు బన్నీ. ఇప్పటి వరకు అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన 15 సినిమాలు రిలీజ్ అయ్యాయి.

సరైనోడు సినిమాతో సూపర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు తన తదుపరి సినిమాను పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. లింగుసామి, విక్రమ్ కుమార్ లాంటి తమిళ దర్శకులతో ప్రయోగాత్మక చిత్రాలు చేయాలని భావించినా.. ఇప్పుడే రిస్క్ ఎందుకన్న భావనతో మరోసారి కమర్షియల్ సినిమాకే కమిట్ అవుతున్నాడు. సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాతో ఫాంలోకి వచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయడానికి అంగీకరించాడు.

ఈ సినిమా కోసం తన కెరీర్ స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్న ఓ రూల్ను బ్రేక్ చేస్తున్నాడు బన్నీ. ఇప్పటివరకు అల్లు అర్జున్ హీరోగా 15 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఈ 15 సినిమాల్లో ఒక్కసారి కూడా బన్నీ తన హీరోయిన్ను రిపీట్ చేయలేదు. చేసిన హీరోయిన్తో మళ్లీ సినిమా చేయకుండా ప్లాన్ చేస్తున్నాడు స్టైలిష్ స్టార్. ఒక్క కేథరిన్ థెరిస్సా మాత్రం ఇద్దరమ్మాయిలతో, సరైనోడు సినిమాల్లో సెకండ్ హీరోయిన్ పాత్రలో కనిపించింది. అంతేకానీ లీడ్ హీరోయిన్ మాత్రం రిపీట్ కాలేదు.

అయితే ఈ రూల్ను బ్రేక్ చేస్తూ తన నెక్ట్స్ సినిమాకు శృతిహాసన్ను హీరోయిన్గా తీసుకోవాలని భావిస్తున్నాడట. బన్నీతో కలిసి రేసుగుర్రం లాంటి బ్లాక్ బస్టర్ హిట్లో శృతి నటించింది. హరీష్తో కూడా శృతిహాసన్కు మంచి రికార్డే ఉంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన గబ్బర్సింగ్ ఇండస్ట్రీ రికార్డ్లను తిరగరాసింది. అందుకే బన్నీ, శృతిహాసన్, హరీష్ శంకర్ల కాంబినేషన్ సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. రూల్ బ్రేక్ చేస్తున్న బన్నీ సక్సెస్ను కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement