ట్రైనింగ్ తీసుకుంటున్న అక్షయ్

ట్రైనింగ్ తీసుకుంటున్న అక్షయ్


రజనీ, శంకర్ల కాంబినేషన్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ చిత్రం రోబో 2. దేశ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించిన రోబో సినిమాకు సీక్వల్గా రూపొందుతున్న ఈ విజువల్ వండర్ను ఇప్పుడు మరింత భారీగా దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే జాతీయ స్థాయి నటులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విలన్ పాత్రకు హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ను సంప్రదించినా, డేట్స్ కుదరకపోవటంతో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్తో చేయిస్తున్నారు.



ఇప్పటికే ఈ సినిమా కోసం కసరత్తులు ప్రారంభించాడు అక్షయ్. పాత్రకు తగ్గట్టుగా బరువు పెరగాల్సి ఉండటంతో చెన్నైలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాడు. దీంతో పాటు సినిమాకు కావాల్సిన కొన్ని యాక్షన్ స్టంట్స్కు సంబందించిన ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు. డిసెంబర్ 16న షూటింగ్ ప్రారంభమైన రోబో సీక్వల్ ప్రస్తుతం చెన్నై పరిసరాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. రజనీకాంత్పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఫిబ్రవరిలో అక్షయ్ కుమార్ రోబో 2 షూటింగ్లో పాల్గొంటారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top