అమర జవాన్‌ కుటుంబానికి సుమలత సాయం

Actress Sumalatha Ambareesh Offers Land To Martyred Guru - Sakshi

ప్రముఖ నటి సుమలత అంబరీష్‌ పెద్ద మనసును చాటుకున్నారు. పుల్వామా ఉగ్రదాడిలో అమరుడైన కర్ణాటకలోని మండ్యకు చెందిన వీర జవాన్‌ గురు కోసం అర ఎకరం భూమిని ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ప్రస్తుతం తన కుమారుడి తొలి చిత్రం షూటింగ్‌ కోసం సుమలత మలేషియా వెళ్లారు. తొలుత గురు అంత్యక్రియలకు స్థలం కేటాయింపుల విషయంలో చిన్న సమస్య తలెత్తిందని తెలసుకున్న సుమలత తన కొడుకుతో కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్కడ అతని అంత్యక్రియలు నిర్వహించి, స్మారక చిహ్నాన్ని నిర్మించవచ్చని భావించారు.

అయితే ఇంతలో రాష్ట్ర ప్రభుత్వం గురు అంత్యక్రియలను నిర్వహించింది. ఈ విషయం  తెలుసుకున్న సుమలత తాను మలేషియా నుంచి తిరిగివచ్చిన అనంతరం.. ఈ అర ఎకరం భూమిని అమర జవాన్‌ గురు కుటుంబసభ్యులకు అందజేయనున్నట్టు తెలిపారు. మండ్య కోడలిగా ఈ గడ్డపై పుట్టిన వీర జవాన్‌ కోసం తన వంతు సాయం చేస్తున్నట్టు సుమలత పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top