ఉదయనిధితో రొమాన్స్‌కు సై | Actress Parvathi Menon will be romantically involved with Udayanidhisthilin | Sakshi
Sakshi News home page

ఉదయనిధితో రొమాన్స్‌కు సై

Aug 14 2017 1:41 AM | Updated on Sep 17 2017 5:29 PM

ఉదయనిధితో రొమాన్స్‌కు సై

ఉదయనిధితో రొమాన్స్‌కు సై

ఉదయనిధిస్టాలిన్‌తో నటి పార్వతీమీనన్‌ రొమాన్స్‌ చేయనుంది.

తమిళసినిమా: ఉదయనిధిస్టాలిన్‌తో నటి పార్వతీమీనన్‌ రొమాన్స్‌ చేయనుంది. అప్పుడప్పుడు కోలీవుడ్‌లో మెరిసిపోతున్న మాలీవుడ్‌ అమ్మడు పార్వతీమీనన్‌. అప్పుడెప్పుడో పూ చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఈ కేరళా కుట్టి ఆ తరువాత ధనుష్‌తో మరియాన్‌ చిత్రంలో చాలా సన్నిహితంగా నటించి వార్తల్లోకి కెక్కింది. ఆ తరువాత కొంత గ్యాప్‌ తీసుకుని బెంగళూర్‌ నాట్కళ్, కమలహాసన్‌తో ఉత్తమవిలన్‌ చిత్రాల్లో మెరిసింది.

నిజం చెప్పాలంటే పార్వతీమీనన్‌ మంచి నటి. తొలి చిత్రం ‘పూ’ లోనే అది నిరూపించుకుంది. అయిదే దురదృష్టం ఏమిటంటే ఈ భామ నటించిన తమిళ చిత్రాలేవీ ఆశించిన విజయాలను సాధించలేదు. తనకి వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించడం లేదట. మాతృభాషలో బాగానే అవకాశాలు వస్తున్నాయట. కాగా మరోసారి తమిళ సినీ అభిమానులను పలకరించడానికి పార్వతీమీనన్‌ రెడీ అవుతోంది. వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్న యువ నిర్మాత, నటుడు ఉదమనిధిస్టాలిన్‌ నటించిన తాజా చిత్రం పొదువాగ ఎన్‌ మనసు తంగం గత శుక్రవారం తెరపైకి వచ్చింది.

అంతకు ముందే ఆయన తన తదుపరి చిత్రానికి  రెడీ అయిపోయారు. ప్రియదర్శన్‌ దర్శకత్వంలో కథానాయకుడిగా  నటిస్తున్నారు. ఆ చిత్ర షూటింగ్‌ ఇటీవలే కేరళాలో ప్రారంభమైంది. అయితే ఇప్పటికీ చిత్రంలో నటించే హీరోయిన్‌ ఎవరన్నది వెల్ల డించలేదు. అదే విధంగా చిత్రం పేరును నిర్ణయించలేదు. చిత్ర షూటింగ్‌ షూటింగ్‌ కుట్రాళంలో జరుపుకుంటోంది. ఇందులో నటి పార్వతిమీనన్‌ కథాయకిగా ఎంపికైంది. పూ చిత్రంలో పల్లెటూరి యువతిగా చక్కని అభినయాన్ని  ప్రదర్శించి మంచి పేరు సంసాదించుకున్న పార్వతీమీనన్‌ తాజాగా ఉదయనిధిస్టాలిన్‌తో నటిస్తున్న చిత్రంలో కూడా గ్రామీణ యువతిగా కనిపించనుందట. ఇందులో పార్వతీమీనన్‌ నటించడంతో ఆమె పాత్రకు మరింత ప్రాముఖ్యతను ఇచ్చారట.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement