కరోనా మా కుటుంబాన్ని వణికించింది | Actress Jahnawi Says That Corona Has Scared Her Family | Sakshi
Sakshi News home page

కరోనా మా కుటుంబాన్ని వణికించింది

Published Fri, Jun 12 2020 7:14 AM | Last Updated on Fri, Jun 12 2020 8:16 AM

Actress Jahnawi Says That Corona Has Scared Her Family - Sakshi

కరోనా తమ కుటుంబాన్ని వణించిందని నటి జాహ్నవి పేర్కొంది. ఈమె దివంగత అతిలోక సుందరి శ్రీదేవి, బాలీవుడ్‌ చిత్ర నిర్మాత బోనీకపూర్‌ కూతురు అన్న విషయం తెలిసిందే. కథానాయికగా బాలీవుడ్లో పరిచయమైన జాహ్నవి అక్కడ తొలి చిత్రంతోనే సక్సెస్‌ అయ్యింది. కాగా ప్రస్తుతం కథానాయికగా బిజీగా ఉన్న జాహ్నవి త్వరలో ఆమె తండ్రి బోనికపూర్‌ తమిళంలో అజిత్‌ హీరోగా నిర్మిస్తున్న వలిమై చిత్రం ద్వారా ఎంట్రీ ఇవ్వనుందని ప్రచారం జోరుగా సాగుతోంది.

కాగా ప్రస్తుతం లాక్‌డౌన్‌ కాలాన్ని ఇంట్లోనే కుటుంబసభ్యులతో జాలీగా జరుగుతున్న నటి జాహ్నవి ఇటీవల ఒక ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె పేర్కొంటూ కరోనా తమ కుటుంబాన్ని వణికించింది అని చెప్పింది. లాక్‌డౌన్‌ కాలాన్ని ఇంట్లో తన కుటుంబ సభ్యులతో చాలా ఎంజాయ్‌ చేస్తూ గడపారని చెప్పింది. అయితే అలాంటి సమయంలో  తమ ఇంట్లో పని చేస్తున్న ఎవరికో కరోనా సోకినట్లు తెలిసిందని చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులంతా కరోనా టెస్టులు చేసుకున్నట్టు చెప్పింది.

ఆ టెస్టుల్లో మరో ఇద్దరు ఇంట్లో పని చేసే వారికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్టు తేలిందన్నారు. దీంతో తామంతా భయంతో ఒణికిపోయి నట్టు చెప్పింది. కాగా ప్రస్తుతం కరోనా మహమ్మారి నుంచి ముగ్గురు పనిమనుషులు బయటపడినట్లు తెలిపింది. ఇప్పుడు తన తండ్రి, చెల్లెలి బాధ్యతలను తానే తీసుకున్నట్టు చెప్పింది. వారి అవసరాలను తానే నెరవేర్చుతునట్లు తెలిపింది. ఇది కొంచెం కష్టమే అయినా తనకు చాలా సంతృప్తిగా ఉందని జాహ్నవి పేర్కొంది. చదవండి: మొదటి రాత్రే భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement