డ్రంక్ డ్రైవ్లో బుక్కయిన నటుడి కుమారుడు | Actor Alok Nath's son caught for drunk driving | Sakshi
Sakshi News home page

డ్రంక్ డ్రైవ్లో బుక్కయిన నటుడి కుమారుడు

Oct 4 2016 11:11 AM | Updated on Apr 3 2019 6:34 PM

డ్రంక్ డ్రైవ్లో బుక్కయిన నటుడి కుమారుడు - Sakshi

డ్రంక్ డ్రైవ్లో బుక్కయిన నటుడి కుమారుడు

మద్యం తాగి వాహనం నడిపిన కేసులో ప్రముఖ బాలీవుడ్ నటుడు అలోక్ నాథ్ కుమారుడు శివాంగ్ బుక్కయ్యాడు. సోమవారం అర్థరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పోలీసుల చేతికి చిక్కాడు.

ముంబయి: మద్యం తాగి వాహనం నడిపిన కేసులో ప్రముఖ బాలీవుడ్ నటుడు అలోక్ నాథ్ కుమారుడు శివాంగ్ బుక్కయ్యాడు. సోమవారం అర్థరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పోలీసుల చేతికి చిక్కాడు. దీంతో అతడిని శాంతా క్రుజ్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి అనంతరం రూ.2,600 ఫైన్ విధించి వదిలేశారు. అయితే, అతడి కారును మాత్రం పోలీస్ స్టేషన్లోనే ఉంచుకున్నారు.

ముంబయిలోని ఖర్ ప్రాంతంలో సోమవారం రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కు పాల్పడేవారికోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అయితే, అదే సమయంలో ఫుల్లుగా మద్యం సేవించి తన స్నేహితుడితో కలిసి మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన శివాంగ్ నాథ్ ను పోలీసులు ఆపే ప్రయత్నం చేయగా అతడు ఆపకుండా వెళ్లిపోయాడు. దీంతో అతడిని శాంతా క్రుజ్ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తీసుకెళ్లి అనంతరం జరిమానా వసూలు చేసి వదిలేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement