గజ తుఫాన్ బాధితులకు ఆది పినిశెట్టి సాయం | Aadhi Pinisetty Contribute for Cyclone Gaja Relief | Sakshi
Sakshi News home page

Dec 8 2018 11:37 AM | Updated on Dec 8 2018 11:37 AM

Aadhi Pinisetty Contribute for Cyclone Gaja Relief - Sakshi

దక్షిణ భారతాన్ని వరుస తుఫాన్లు వణికిస్తున్నాయి. ఇప్పటికీ తిత్లీ తుఫాన్ నుండి ఆంధ్రప్రదేశ్ పూర్తిగా తేరుకోకముందే గజ తుఫాన్ తమిళనాడును జలమయం చేసేసింది. బాదితులను ఆదుకునేందుకు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ తారలు తుఫాను ప్రభావిత ప్రాంతాలను ఆదుకునేందుకు విరాళాలను ప్రకటించారు.

తాజాగా మరో యంగ్ హీరో ముందుకొచ్చాడు. హీరో ఆది పినిశెట్టి గజ తుఫాన్ బాధితులకు తన వంతు తాను సాయం అందించడానికి ముందుకొచ్చాడు. ఆది పినిశెట్టి తన టీమ్ తో కలిసి హెల్ప్ చేయడానికి కాస్త సమస్యగా ఉన్న కొన్ని ఏరియాలను గుర్తించి.. అక్కడికి వెళ్లి సుమారు 5 టన్నుల రిలీఫ్ మెటీరియల్.. ఫుడ్, మెడిసన్, బెడ్ షీట్స్, సోలార్ లైట్స్, దోమ తెరలు అంధించారు.

4 గ్రామాల్లో దాదాపు 520 కుటుంబాలకు, వారి వారి రేషన్ కార్డులని పరిశీలించి చేయూతనందించారు. అంతేకాకుండా...ఈ తుఫాన్ బాధితులను ఆదుకోవడానికి ప్రతిఒక్కరూ ముందుకు రావాలని, వారిని ఆదుకోవాలని ఆది పినిశెట్టి కోరారు.


Advertisement
Advertisement
 
Advertisement
Advertisement