ఒక సినిమా, ఆరు నిర్మాణ సంస్థలు | 6 producers for Mahesh Babu Murugadoss film | Sakshi
Sakshi News home page

ఒక సినిమా, ఆరు నిర్మాణ సంస్థలు

Jun 19 2016 10:54 AM | Updated on Sep 4 2017 2:53 AM

ఒక సినిమా, ఆరు నిర్మాణ సంస్థలు

ఒక సినిమా, ఆరు నిర్మాణ సంస్థలు

ఇండస్ట్రీలో రోజు రోజుకు భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

ఇండస్ట్రీలో రోజు రోజుకు భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ పరిధులు దాటి పోతుండటంతో నిర్మాణ రంగంలో ఈ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారీ బడ్జెట్ తో పాటు అంతర్జాతీయ స్థాయిలో సినిమాను ప్రేక్షకులకు చేరువ చేయటం కార్పోరేట్ కంపెనీలతో చేతులు కలుపుతున్నారు భారీ చిత్ర నిర్మాతలు. అదే బాటలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఓ సినిమా కోసం ఏకంగా ఆరు నిర్మాణ సంస్థలు కలిసి పని చేస్తున్నాయి.

మహేష్ బాబు హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ఓ యాక్షన్ మూవీని చేస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయిన ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇప్పటికే ఈ సినిమాకు బడ్జెట్ 80 కోట్ల వరకు అవుతుందని అంచనాలు వేస్తున్నారు. ఇంత భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకోసం ఆరు నిర్మాణ సంస్ధలు కలిసి పని చేయనున్నాయి.

ముందు నుంచి చెపుతున్నట్టుగా ఠాగూర్ మధు, ఎన్వీప్రసాద్ లు  నిర్మాతలుగా వ్యవహరిస్తారు. వీరితో పాటు రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్, లియో ప్రొడక్షన్స్, మెగా సూపర్ గుడ్ ఫిలింస్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ లు నిర్మాణంలో భాగం పంచుకుంటాయి. ఇక హీరో మహేష్ బాబు కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తాడు.

Advertisement
 
Advertisement
Advertisement