ఆమె నన్ను ఇష్టపడుతోందనే భ్రమలో.. | Venkata Hari Charan Sad Ending Telugu Love Story | Sakshi
Sakshi News home page

ఆమె నన్ను ఇష్టపడుతోందనే భ్రమలో..

Dec 30 2019 8:33 PM | Updated on Dec 30 2019 8:46 PM

Venkata Hari Charan Sad Ending Telugu Love Story - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

నేను ఎప్పుడూ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడే వాడిని కాదు. అందరు అబ్బాయిల్లాగా అమ్మాయిల వెంట పడే వాడ్ని కాదు. ఎప్పుడు చదువు మీద ధ్యాస ఉండేది. అలా డిగ్రీ డిస్టింక్షన్లో పాస్ అయ్యాను. తరువాత ఐసెట్ ద్వారా ఎంసీఏ హైదరాబాద్‌లో పూర్తి చేశాను. నేను నా సెమిస్టర్ ఎక్షామ్స్‌ అప్పుడు మాత్రమే కాలేజీకి వెళ్లేవాడిని. అప్పుడు కూడా నేను కాలేజీకి వెళ్లకున్నా ఎంసీఏ ఫస్ట్ క్లాస్‌లో పూర్తి చేశాను. ఎంసీఎ పూర్తి చేసిన తర్వాత అందరి లాగా ఏదో ఒక​ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో జాబ్ చేయాలనుకోలేదు.

సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేద్దామని సోషల్ మీడియాను ఎంచుకున్నాను. అలా నేను సోషల్ మీడియాలో లీనం అయ్యాను. నాలాంటి ఆలోచనలు ఉన్న అమ్మాయి ఫేస్‌బుక్‌ ద్వారా నాకు పరిచయం అయింది. నేను ఎప్పుడూ మెసేజెస్ పెట్టేవాడిని కాదు. ఆ అమ్మాయి కూడా నా లాగే ఫేస్‌బుక్‌లో ఓ సొసైటీకి సంబంధించిన పేజీని రన్‌ చేస్తుండేది. ఆమె ఎప్పుడూ సొసైటీ మీద ఎక్కువ దృష్టి పెట్టేది. అలా నేను ఆమె ప్రతి పోస్ట్‌కు లైక్స్‌, కామెంట్స్ పెట్టేవాడిని.

ఎవరైనా నెగటివ్‌గా కామెంట్స్ పెడితే నేను హీరోలాగ వాళ్లకు రిప్లై ఇచ్చేవాడిని. ఆమె నన్ను ఇష్టపడుతుందనే భ్రమలో నేను నా బిజినెస్, జాబ్ మీద దృష్టి పెట్టలేదు. ఒక రోజు నా మనస్సులోని మాట ఆమెకు చెప్పాను. అప్పుడు ‘ నువ్వు జస్ట్ ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌వు మాత్రమే’ అని రిప్లై ఇచ్చింది. ఆమె నన్ను కాదనేసరికి నేను పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లాను. నాకు అందరిలాగా ఫ్రెండ్స్ ఎక్కువగా లేకపోవడం వల్ల డిప్రెషన్‌లోంచి బయటపడలేకపోయాను. ఇప్పుడు నేను సోషల్ మీడియాను పక్కన పెట్టి జాబ్ కోసం ట్రై చేస్తున్నా. ఇప్పుడు ప్రేమ అంటేనే చాలా భయం వేస్తోంది.
- వెంకట హరి చరణ్‌

చదవండి : ప్రేమ కోసమై పనిలో పడనే పాపం పసివాడు!!
పిచ్చి పిల్ల.. చెడా మడా తిట్టేశా!



లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement