ఆమె నవ్వితే నా బాధలు మర్చిపోతా! 

Telugu Love Stories : Praveen Breakup Love Story From Miryalaguda - Sakshi

నేను పనిచేస్తున్న ఆఫీసులో మొదటిసారి చూశాను తనని. ఆమెను చూడగానే చాలా నచ్చేసింది. నాతో తను మాట్లాడితే బాగుండు అని ప్రతిరోజూ అనిపించేది. నేను తనతో మాట్లాడాలంటే భయమేసేది. అనుకోకుండా ఓ రోజురాత్రి 8గంటలకు తననుంచి నాకు ఫోన్‌ వచ్చింది. అప్పుడు నా సంతోషం ఆకాశానికి ఎగిరింది. అప్పుడు జోరుగా వర్షం కురుస్తోంది! ఆ వర్షంలో తడుచుకుంటూ ఆమెతో మాట్లాడినది మొదటిరోజు. తర్వాత మా మధ్య బంధం పెరిగింది. ఆమెకు ఐ లవ్‌ యూ చెప్పాలని నా మనసు తహతహలాడిపోయేది. అయితే నా ప్రేమ సంగతి చెబితే తను ఎక్కడ దూరం అవుతుందో అని భయం. మొత్తానికి ఓ రోజు రాత్రి 9 : 40  గంటలకు ఆమెకు నా ప్రేమను తెలియజేశాను. ఆమె ఏం అనలేదు! కొంచెం నవ్వింది. అప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. కొన్ని రోజుల తర్వాత తాను కొన్ని లెక్కలు చెప్పింది! మిత్రులుగా ఉందాం అంది. నేను ఆ రోజు చాలా ఏడ్చాను.

తర్వాత మా మధ్య ప్రేమ స్నేహం కొనసాగింది. తన మాటలు అంటే నాకు చాలా ఇష్టం. తను నవ్వితే నేను నా బాధలు మర్చిపోతా.  ఆ తర్వాత కొద్దిరోజులకు ఆమెకు పెళ్లి కుదిరింది. ఒకవైపు బాధ మరోవైపు సంతోషం. ఆమె పెళ్లికి నేను వెళ్లాను. ఆమెకు తన భర్త తాళి కడుతుంటే నా వైపు చూసింది! అప్పుడు నా గుండె పగిలిపోయేంత బాధగా అనిపించింది. నేను వెనక్కి వచ్చినపుడు తాను నా దగ్గరకి వచ్చిన మూమెంట్‌ నేనెప్పటికీ మర్చిపోలేను. తన ఇంట్లో అందరు మంచిగా చూసుకున్నారు. ఆమెను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. తను ఎప్పుడన్నా ఫోన్‌ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్‌ అవుతా. 
-  ప్రవీణ్‌


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top