అతన్ని ప్రేమిస్తున్నందుకు గర్వపడుతున్నా

Telugu Love Stories I Am Proud Of My Man I Love Him Forever Tejaswini - Sakshi

ప్రేమించిన వాళ్ల గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ఒక్క క్షణం చాలు. ఆ ఒక్క క్షణంలో వాళ్ల ప్రేమ ఎంత గొప్పదో మనకి అర్థమవుతుంది. ఇలాంటి ఒక సంఘటన నా ప్రేమ కథలో కూడా జరిగింది. మాది 10 ఏళ్ల ప్రేమ అనుబంధం. అమ్మాయిని కనుక, ప్రేమించింది నా అత్త కొడుకుని అయినా ఎక్కడో ఏదో మూల భయం ఉండేది. అంటే తను నన్ను వదిలేస్తాడని కాదు! తన ప్రేమ నిజమైనదా కాదా.. నన్ను నిజంగానే ఇంతలా ప్రేమిస్తున్నాడా..? అని అనిపించేది. అందరి ప్రేమ కథల్లో ఉన్నట్టే మాకు చాలా గొడవలు జరిగేవి. కానీ, వెంటనే కలిసి పోయే వాళ్లం. చాలా మంది మమ్మల్ని చూసి ‘ఏంటి వీళ్లు! ఎంత గొడవపడినా ఆ తర్వాత వెంటనే కలిసిపోతారు. ఎలా సాధ్యం’ అని నన్ను అడిగిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.

అదే ప్రేమ గొప్పదనం. కానీ 2017 ఆగస్టులో తన ప్రేమ నా జీవితానికి ఎంత అవసరం అనేది అప్పుడే అర్థమైంది. ఆ సంఘటన ఏంటి అనేది నేను వివరించలేను కానీ, ఆ పరిస్థితి వల్ల నేను మానసికంగా చాలా డిస్టర్బ్ అయ్యాను. ఫిజికల్‌గా కూడా చాలా వీక్ అయ్యాను. సమస్య చాలా పెద్దది కావటంతో నా లైఫ్‌ ఎఫెక్ట్ అయింది. అలాంటి లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం అది. ఆ రోజు తను కావాలంటే నన్ను వదిలేయవచ్చు. కానీ, ఆ రోజు తను నాతో ఇలా అన్నాడు ‘ప్రేమించాను, ఏదైనా! ఏం జరిగినా.. చచ్చేదాకా నీతోనే ఉంటాను ’ అని. తను నాకోసం ఎంత గొప్పగా ఆలోచించాడు, తన ప్రేమను ఎంత గొప్పగా వ్యక్తపరిచాడు. నాకు ఆ రోజు అర్థమైంది. ఇలాంటి వాడినా నేను అవమానించేది అనిపించేది.

ఆ రోజు నుంచి నేను చాలా బోల్డ్‌గా ఉండేదాన్ని. ఎందుకంటే తను నాకు చాలా ధైర్యం ఇచ్చాడు. నాలో ఉండే భయం ఆ రోజుతో పోయింది. నా వందేళ్ల జీవితం తనతోనే అని నాకు అర్థం అయింది. నిజమైన ప్రేమ గురించి మనం ఎప్పుడూ ఎదుటివారిని అడగకూడదు. వారిలో తప్పులు వెతుక్కోకూడదు మన ప్రేమలో నమ్మకం ఉంటే అదే మన ప్రేమని గెలిపిస్తుంది. లైఫ్‌లో నిజంగా లవ్ చేసి ఉంటే మనం ప్రేమించిన వారు మనకి కరెక్ట్ అని తెలిపే సందర్భాన్ని దేవుడు అందరికీ ఇస్తాడు. కానీ అది తెలుసుకో లేనివాళ్లు ప్రేమ అనే పదాన్ని వాడి చాలా ఇబ్బందులు పడేలా వాళ్ల జీవితాన్ని మలుచుకుంటున్నారు. అతన్ని ప్రేమిస్తున్నందకు నేను గర్వపడుతున్నాను. నేనతన్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా.
- తేజస్విని


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top