చచ్చే దాకా అతడు నా గుండెల్లో ఉంటాడు

Sad Ending Telugu Love Stories: He Will Be In Heart Until My Death Jaya Gowda From Tamil Nadu - Sakshi

అవి నేను బీటెక్‌ చదివే రోజులు.. సమయం చాలా హ్యాపీగా గడిచిపోతోంది. అప్పుడు అనుకోకుండా నేనొక అబ్బాయిని కలిశాను. ప్రేమ అంటేనే నచ్చని నాకు తొలిచూపులోనే అతడు నచ్చాడు. ఎందుకో తనను చూసిన ప్రతిసారి మనసులో ఏదో ఫీలింగ్‌. తను, నేను కొన్ని రోజులు మా కాలేజీ బస్సులో కాలేజ్‌కు వెళ్లేవాళ్లం. కొన్ని రోజుల తర్వాత కాలేజ్‌ బస్సులో కాకుండా ప్రైవేట్‌ బస్సులో వెళ్లేవాళ్లం. అలా బస్సు జర్నీలో మా పరిచయం మొదలైంది. తను నన్ను ఇష్టపడుతున్నాడని తర్వాత తెలిసింది. నేను బీటెక్‌ సెకండ్‌ ఇయర్‌లో ఉన్నప్పటినుంచి అతను నన్ను ప్రేమిస్తున్నాడని తెలుసుకున్నాను. ఎంతో మంది నాకు ప్రపోజ్‌ చేశారు. ఎందుకో ఎవరి ప్రేమా ఒప్పుకోని నేను అతడు ప్రపోజ్‌ చేయగానే మా ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా ఓకే చెప్పేశాను.

అలా నాలుగేళ్లు హ్యాపీగా గడిపాము. నేను బెంగళూరులో జాబ్‌ తెచ్చుకున్నాను. తను జాబ్‌ సంపాదించి వాళ్ల అమ్మానాన్నలను ఒప్పిస్తాడని రెండేళ్లు ఒక కుక్కలా ఎదురు చూశాను. నా గురించి వాళ్ల పేరెంట్స్‌కు చెప్పమని ప్రతిరోజు అడుక్కునే దాన్ని. చాలా క్యాజువల్‌గా కామెడీగా తీసుకునేవాడు. ఇంట్లో వాళ్ల ఒత్తిడి పెరిగింది! సంబంధాలు చూడటం మొదలుపెట్టేశారు. ఇక నాకు అర్థమైంది. నేను మోసపోయానని. చివరకు మా పేరెంట్స్‌ చూసిన సంబంధం ఓకే చేశాను. నాకు ఎంగేజ్‌మెంట్‌ అయ్యాక తను వచ్చాడు మా పేరెంట్స్‌తో మాట్లాడటానికి. మా పేరెంట్స్‌! పరువుకు విలువ ఇచ్చి అతనికి నో చెప్పారు.

నేను అమ్మానాన్నల పరువుకు విలువ ఇచ్చి మనసు చంపుకుని వేరే పెళ్లి చేసుకున్నాను. కానీ, తన మీద ఉన్న ప్రేమ ఇప్పటికీ అలానే ఉంది. డైలీ తను గుర్తుకు వస్తాడు. ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికోసం ఏడవనంతగా నేను తన కోసం ఏడ్చాను! ఏడుస్తూనే ఉన్నా.. ఏడుస్తూనే ఉంటా. ప్రేమించేటప్పడు ఎంత బాగుంటుందో.. ఆ ప్రేమ దూరం అయ్యాక అంత బాధగా ఉంటుంది. నిజంగా ప్రేమ అంటే ఏంటో నా ప్రేమను పోగొట్టుకున్నపుడు తెలిసింది. నేను చచ్చే దాకా అతడు నా గుండెల్లో ఉంటాడు. దేవుడితో యుద్ధం చేసి వచ్చే జన్మలోనన్న నా ప్రేమను గెలిపించుకుంటాను.
- జయ గౌడ, తమిళనాడు 


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top