ఆమె ప్రేమలో పడి పెళ్లైన సంగతి మర్చిపోయా

Sad Ending Telugu Love Storie Of Vighnesh - Sakshi

వైజాగ్‌లోని ఓ కాలేజ్‌లో నేను జాబ్‌చేసే వాడిని. అప్పుడు తను బ్యాంక్‌ ఎక్షామ్‌ రాయటానికి వచ్చింది. నేను ఆ ఎక్షామ్‌కి ఇన్విజిలేటర్‌ను. తను చూడటానికి చాలా సంప్రదాయంగా ఉంటుంది. తన క్యూట్‌ లుక్స్‌ నన్ను కట్టిపడేశాయి. వెంటనే అడ్మిట్‌ కార్డ్‌ మీద ఉన్న తన ఫోన్‌ నెంబర్‌కి కాల్‌ చేశాను. పరిచయం చేసుకున్నాను. తను కూడా పాజిటివ్‌ వేలో రెస్పాండ్‌ కావటం వల్ల నెమ్మదిగా మాటలు కలిశాయి. అప్పటినుంచి ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లు. తన ప్రేమలో పడి నాకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారన్న సంగతి కూడా మర్చిపోయాను. మొదట్లో తనకు ఆ నిజం చెప్పకపోయినా నెమ్మదిగా చెప్పేశాను. ఆ విషయం తెలియగానే ‘ మరి ఎందుకు నన్ను ప్రేమించావ్‌?’ అని అడిగింది.

‘ప్రేమ ఎప్పుడు, ఎ‍క్కడ, ఎలా, ఎవరి మీద పుడుతుందో తెలియదు.చిన్నతనంలోనే పెళ్లై కుటుంబ బరువు బాధ్యతలు ఎత్తుకున్న నేను నిన్ను చూడగానే పులకించి పోయాను. ప్రేమకు చిరునామా పెళ్లి కాదు. నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి. ఆ సంతోషాన్ని నేను చూస్తూ ఉండాలి’ అని చెప్పటంతో నన్ను కూడా తను నెమ్మదిగా ఇష్టపడింది. ఈ క్రమంలో తను నన్ను బావా అని పిలిచేది. మెంటల్‌గా నేను తనకు బాగా దగ్గరయ్యాను. ఓ రోజు కాల్‌ చేసి సడెన్‌గా నీతో కలిసి మాట్లాడాలి అంది. ‘మనం తప్పు చేస్తున్నాం. నీ వైఫ్‌కి నేను ద్రోహం చేస్తున్నాను. నామీద మా అక్క కూతురు బాధ్యత ఉంది. నీతో రిలేషన్‌ షిప్‌లోఉండగలను కానీ, దాన్ని కంట్రోల్‌ చేసుకుని ఫ్రెండ్‌షిప్‌గా మాత్రం ఉండలేను’ అంటూ బ్రేకప్‌ చెప్పింది.

తనను కలవటానికి చాలా సార్లు ట్రై చేశా! కానీ, మళ్లీ తను తన జీవితంలోకి నన్ను వెల్‌కమ్‌ చెప్పలేదు. కొన్నాళ్లకు తనకు పెళ్లైంది. ఆమెను చూడాలనిపించి తను జాబ్‌ చేసే చోటుకు వెళ్లాను. నేను ఎవరో తెలియనట్లు వెళ్లిపోయింది. తట్టుకోలేక ‘చూసి నవ్వొచ్చు కదా!’ అని మెసేజ్‌ చేశా. అప్పుడు ఆమె ఫోన్‌ వాళ్ల భర్త దగ్గర ఉండటం వల్ల గట్టిగా అడిగాడంటా. ఆ తర్వాత తను వెంటనే కాల్‌ చేసి నువ్వు నాకు ఇంకెప్పుడూ కాల్‌ చేయకు అని సీరియస్‌గా చెప్పటంతో నా మనసు చాలా బాధపడింది. ఇక తనను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక నేను కోరుకున్న ఆమె సంతోషాన్ని ఇప్పుడు తన కూతురు వాట్సాప్‌ డీపీలో చూసుకుంటున్నా.
 - విఘ్నేశ్‌(బావ)


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top