అతడ్ని మర్చిపోలేక రోజూ ఏడుస్తున్నా

Ritika Sad Ending Telugu Love Story - Sakshi

ఓ అబ్బాయి నన్ను ప్రేమించానన్నాడు. ఎంత ప్రేమించావ్‌ అని అడిగితే.. నీ తర్వాతే ఎవరైనా అని బిస్కట్‌ వేశాడు. ప్రతిరోజూ నా వెంటపడ్డాడు. నేను కొన్ని రోజుల తర్వాత ఒప్పుకున్నాను. తనకు డైరీ రాయటం అలవాటు ఉంది. తన డైరీ తీసుకుని రమ్మని అడిగి డైరీ చదివా. అందులో మొత్తం మేము మాట్లాడుకున్నదే ఉంది. తను నన్ను మీట్‌ అయినప్పటినుంచి తన ఫీలింగ్స్‌ గురించి మొత్తం రాశాడు. ఎప్పటికీ అలాంటి ఫీలింగ్స్‌ ఉంటాయని భావించి తప్పచేశా. అయితే కొంత కాలం వరకు బాగానే సాగింది. నేను మార్నింగ్‌ కచ్చితంగా మెసేజ్‌ చేయాలి అనేవాడు. నేను కుదరదు చదువుకోవాలి అని చెప్పినా.. నేను మెసేజ్‌ చేయందే రోజు గడవదు అనేవాడు. రోజూ ఫోన్‌లు, మెసేజ్‌లు తప్పనిసరి. నైట్‌ కనీసం కాల్ అన్నా చేయాలి. ఒక గంట మాట్లాడకుంటే ఫీల్‌ అయ్యేవాడు. అలాంటిది ఇప్పుడు ఏవో కారణాలు చెప్పి నాకు మెసేజ్‌, ఫోన్‌ చేయటం లేదు. ఒకప్పుడు నాతో మాట్లాడకుండా ఉండలేను అన్నాడు. మనుషులు ఎలా ఇలా మారిపోతారో అర్థం కావటం లేదు. నేను నీకు ఎప్పుడైనా గుర్తుకువస్తానా అని అడిగితే.. గుర్తుకు వస్తావు కానీ, ఇప్పుడు నేను చాలా బిజీ అంటాడు.

నన్ను తనకు అడిక్ట్‌ అయ్యేలా చేసి సడెన్‌గా నన్ను అవాయిడ్‌ చేస్తున్నాడు. ఒకవేళ నేను కాల్ చేస్తే చాలా బిజీ అని, ఎక్కడికో వెళ్లానని కథలు చెబుతున్నాడు. అలాంటి వాడికి ఫోన్‌ చేయటం ఏంటని నా మీద నాకే కోపం వస్తోంది. నాకు ఆ అబ్బాయి రోజూ గుర్తుకు వస్తాడు. మర్చిపోలేక రోజూ ఏడుస్తున్నా. నేను తనకు కాల్‌ చేయటం మానేశా, తను కాల్‌ చేస్తే మాట్లాడే ఇష్టం పోయింది. రెండు వారాలకోసారి ఫోన్‌ చేసి నేను తనుకు గుర్తుకు ఉన్నానని కథలు చెబుతాడు. రెండు వారాలు మాట్లాడేది పది నిమిషాల్లో మాట్లాడతాడు. అతడితో మాట్లాడకూడదని నిర్ణయించుకున్నా. నెంబర్‌ బ్లాక్‌ లిస్టులో పెట్టా. ఓ మనిషి ఊసరవెల్లిలా ఎలా రంగులు మార్చగలడో నేను చూస్తున్నా. ఓ అబ్బాయిని నమ్మి తప్పు చేశానన్న ఫీలింగ్‌తో ఉన్నా. 
- రితిక 
చదవండి : 
ప్రేమ కోసం పశువుల కాపరిగా..
నేను కాదంటే చనిపోతానంది.. చివరకు..


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top