అలా చేస్తే సమాజంలో తల ఎత్తుకు తిరగలేం! | Prashant Sad Telugu Love Story | Sakshi
Sakshi News home page

విలువలకి ప్రేయసికి మధ్యలో నలిగి..

Dec 20 2019 4:41 PM | Updated on Dec 20 2019 4:51 PM

Prashant Sad Telugu Love Story - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మా నాన్న మధ్యతరగతి వాడైనా విలువలతో బ్రతకడం చిన్నప్పటి నుంచి చూశాను . అదే విధంగా విలువలతో బ్రతకాలన్నదే నా జీవిత ఆశయం. అలా ఇంజనీరింగ్‌లో జాయిన్ అయ్యాను. రెండవ సంవత్సరంలో నాకు ఒక అమ్మాయి పరిచయం అయ్యింది. ఒకరిని ఒకరం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. ఒకరు లేకపోతే ఇంకొకరు లేనట్టుగా బ్రతికాం. ఇప్పటికీ అలాగే ఉన్నాం. మేం స్నేహితులమని మా ఇద్దరి ఇళ్లలో కూడా తెలుసు. ఇలాగే వాళ్ల ఇంట్లో వాళ్లకి బాగా దగ్గరయ్యా. మా కులం వేరైనా వాళ్లు నన్ను బాగానే చూసుకునే వాళ్లు. అలాగే ఇద్దరం గ్రాడ్యుయేట్లము అయ్యాము. నాకు 50వేల రూపాయలతో ఉద్యోగం వచ్చింది. తను కష్టపడి బ్యాంక్ ఉద్యోగి అయ్యింది. ఇప్పటికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. ఇంతలోనే మాకు సమస్య వచ్చింది. అది తన పెళ్లి చూపుల రూపంలో. నేను మా ప్రేమ గురించి వాళ్ల ఇంట్లో చెప్పమన్నాను. తను చెప్పింది! వాళ్ల అమ్మ ఒప్పుకోలేదు .

‘ప్రశాంత్ నా బిడ్డలాంటివాడు. నేను అతనితో మాట్లాడుతా’ అని నాతో మాట్లాడింది. ‘మేం నీకు మా పాపని ఇవ్వడం కుదరదు. నువ్వు ఎప్పటికీ మా బిడ్డలా తనకి స్నేహితునిగా ఉండిపో. తనని నీకు ఇస్తే ఈ సమాజంలో మేము తల ఎత్తుకుని తిరగలేని పరిస్థితి వస్తుంది’ అని అంది. నాకు వాళ్లని ఎదురించి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అందులో వాళ్లకి ఇంకో అమ్మాయి ఉంది. మేము ఏమైనా తప్పు చేస్తే తనకి పెళ్లి  కాదేమో అని అనుకుంటున్నారు. వాళ్లని  ఏ విధంగా ఒప్పించాలో తెలియడం లేదు. కానీ తనకు నేను కావాలి, నాకు తను కావాలి. ఇంకా మాలో చిన్న ఆశ అలాగే ఉంది. ఏదో ఒకటి జరిగి మేము కలుస్తాం అని.

తను నాకోసం నేను తన కోసం ఇప్పుడు బ్రతుకుతున్నా, ఏదో భయం మా మనసులో ఒకరికి ఒకరు కాకుండా పోతామేమో అని. ఒక పక్క మార్చిలో పెళ్లి చేసేందుకు వాళ్ల ఇంట్లో ప్రయత్నాలు మొదలు పెట్టారు. తనేమో నన్ను ‘నువ్వు ఏదో ఒకటి చెయ్యి, నేను దేనికైనా సిద్దం’ అంటుంది. కానీ వెళ్లిపోవడానికో.. లేకుంటే ఎవరితో అయినా తనని మా ఇంటికి తీసుకొని వద్దాం అంటే నా విలువలు అడ్డం వస్తున్నాయి. విలువలకి ప్రేయసికి మధ్యలో నలిగి, కుమిలి పోతున్నాను.
- ప్రశాంత్


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement