పదేళ్ల తర్వాత కూడా అదే ప్రేమ | Pardhu Sad Ending Telugu Love Story From Kurnool | Sakshi
Sakshi News home page

పదేళ్ల తర్వాత కూడా అదే ప్రేమ

Dec 14 2019 4:25 PM | Updated on Dec 14 2019 4:41 PM

Pardhu Sad Ending Telugu Love Story From Kurnool - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

అవి నేను డిగ్రీ చదివే రోజులు. ఒకసారి మా మేనమామ పెద్ద కూతురు ఎంగేజ్‌మెంట్‌కు వెళ్లాం. అక్కడ మా చిన్న మరదల్ని చూశాను. ఆమె మాతో పాటు మా ఇంటికి రావటానికి ఇష్టపడింది. మేము ఆమెని కనీసం ఇంటికి రమ్మని కూడా పిలవలేదు. ‘మీ ఇంటికి వస్తాను’ అని అడిగినా మేము తనను పట్టించుకోలేదు. నాకు మాట్లాడాలని ఉన్నా మా పేరెంట్స్‌కు ఇష్టం లేదని మౌనంగా ఉండిపోయాను. నన్ను అప్పట్లో తను ఇష్టపడిందని అనిపించింది. కాలం గడిచింది. నేను డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశా. ఆమె కూడా డిగ్రీ చదివింది. ఆ తర్వాత నా పెళ్లి పెద్దలు చూసిన అమ్మాయితో జరిగింది. ఆమె కూడా పెళ్లి చేసుకుని విదేశంలో స్థిరపడింది.

ఈ మధ్యలోనే ఒక పెళ్లికి ఆమె కూడా వస్తోందని తెలిసి చూడటానికి వెళ్లాను. మాములుగానే పలకరించింది. కొన్ని మాటలే  మాట్లాడుకున్నాం. కానీ నేను ఆమెని మర్చిపోలేకపోయా. ఏదో ప్రేమ ఆమె గురించి నన్ను ఆలోచించేలా చేస్తోంది. ఆమెతో ఉన్న కొన్ని నిముషాలు చాలా సంతోషంగా గడిచిపోయాయి. తర్వాత రోజు మళ్లీ తనను చూడాలనిపించి వాళ్ల ఇంటికి వెళ్లాను. ఒక పది సంవత్సరాల ముందు ఎలా మర్యాదగా, ప్రేమగా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది.

ఆమెతో ఉన్న కాసేపు చాలా సంతోషంగా అనిపించింది. నిజమైన ప్రేమలో ఎంత సంతోషం ఉందనేది అప్పుడే అర్థం అయింది.  ఇంక నా మనసు అక్కడే ఉండిపోయింది. ఎన్ని రోజులు అయినా బయటకి రాలేకపోతున్నా. మనల్ని నిజంగా ప్రేమించే వాళ్లని మనం ఇష్టపడేవా‍ళ్లని జీవితంలో ఎప్పుడూ వదులుకోకూడదు. అలా వదులుకుంటే మన జీవితంలో సంతోషమే ఉండదు. తను మళ్లీ నాతో మాట్లాడుతుందో లేదో తెలీదు. మళ్లీ నాకు కనపడుతుందో లేదో తెలీదు. కానీ... 
ఐ  లవ్ యూ … మిస్సింగ్ యూ ఏ లాట్ …. అల్ ది బెస్ట్. 
- పార్థు, కర్నూలు


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement