మాది స్నేహం మాత్రమే ప్రేమ కాదని తేలిపోయింది

Maheshwar Sad Ending Telugu Love Story From Yadagirigutta - Sakshi

ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రోజుల్లో నా క్లాసుమేట్ అమ్మాయిని ఇష్టపడ్డాను. ఓ రోజున భువనగిరి ఆర్‌టీసీ బస్‌స్టాండ్‌లో నా ప్రేమ విషయాన్ని ఆమెకు తెలియపరిచాను. ఆమె సున్నితంగా ‘మా నాన్నకు మంచి పేరుంది. అది చెడగొట్టడం నాకు ఇష్టం లేదు’ అని అంది. అప్పుడు నేను కొన్ని రోజులు ఆమెను ఫాలో అయ్యాను. కానీ నేను ఇలా వెంబడించి ఆమెను బాధపెట్టడం సరికాదనుకున్నాను. నాలో తీవ్ర ఘర్షణ మొదలైంది. అనవసరంగా నా ప్రేమను తెలియపరిచాను, వెంబడించానని లోలోన మదనపడ్డాను. ఈ లోపు పుణ్యకాలం గడిచిపోయి పరీక్షలు వచ్చాయి. అప్పుడు మేల్కొని ఆమెతో తిరిగి మాట్లాడాను. ‘ఇంతకు ముందు నేను చేసిన పనులు మరిచిపోండి. జరిగిన విషయాన్నీ నేను కూడా మరిచిపోయాను. ఇక ముందు మనం గతంలో మాదిరిగానే ఉందామ’ని చెప్పాను.

ఆ తర్వాత ఆమె నాతో మాట్లాడటం మొదలుపెట్టింది. పరీక్షల్లో ఆమె పాస్ అయింది! నేను ఫేయిల్ అయ్యాను. అనంతరం సప్లిమెంటరీ రాసి పాస్ అయ్యాను. ఆమె చేరిన డిగ్రీ కాలేజీలోనే నేనూ చేరాను. కానీ కొద్దిరోజుల తర్వాత ఆమె కాలేజీకి రావటం మానేసింది. నేను రావడంతోనే ఆమె కాలేజీ మానేసిందని అనుకుని ఆమె లేని కాలేజీకి నేను కూడా వెళ్లకూడదని మానేశాను. అనంతరం నేను ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్‌లో చేరాను. అప్పుడు తెలిసింది.. ఆమె కాలేజీ మారింది మరో కారణం వల్ల అని. అది తెలిసి నేను అనవసరంగా చదువు మానేశాను అని బాధపడ్డాను. ఆమె సిటీలో డిగ్రీ పూర్తీ చేసింది. అనంతరం ఒకసారి ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం కానీ పాత విషయాలేవీ తీయలేదు. ముందుగా నేను వేరే అమ్మాయిని లవ్ మ్యారేజి చేసుకున్నాను. అనంతరం ఆమె పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంది.

ప్రస్తుతం ఆమె అమెరికాలో, నేను హైదరాబాద్‌లో స్థిరపడ్డాము. ఇటీవల మా క్లాస్‌మేట్స్ గెట్ టుగెథెర్ జరిగింది. ఆమెకు ఆహ్వానం పంపించాను. అది తీసుకున్న ఆమె మా స్నేహితులకు నా గురించి చాలా మంచిగా చెప్పింది. నేను కూడా మా గెట్ టుగెథెర్ కార్యక్రమంలో ఆమెకు సమున్నత స్థానం​ కల్పించాను. మేము ఇప్పటికీ సహ విద్యార్థులుగా, పరిచయస్థులుగా ఉన్నాం. కానీ ఆమెను నేను గానీ నన్ను ఆమె గానీ ఎప్పుడు నిందించుకోలేదు. తక్కువచేసి చూడలేదు. ఆమె ఆనందాన్నే నేను ఎప్పటికైనా కోరుకుంటాను. ఆమె దూరమైనందుకు నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే, మంచిగా చూసుకునే ప్రేమికురాలు నాకు భార్యగా దొరికింది.

నేను నా భార్యనే నా దేవతగా చూసుకుంటున్నాను. నా ప్రేమ ఫేయిల్ అయ్యిందని పిచ్చి వేషాలు వేయలేదు. అందుకు నేను ఆమెకు కృతఙ్ఞతలు చెప్పాలి. ఇప్పుడు నా క్లాసుమేట్, నేను మళ్లీ మాట్లాడుకుని కుశల ప్రశ్నలు వేసుకునే వాతావరణం నెలకొన్నది. నేను ఆనందంగా ఉన్నాను. అటు ఆమె కూడా ఆనందంగా ఉన్నారు. ఆ దేవుడికి కృతజ్ఞలు. ప్రేమ ఫేయిల్ అయితే పిచ్చివేషాలు వేయకూడదని విఫల ప్రేమికులకు నా ఉచిత సలహా మిత్రుల్లారా ..
- సంపత్‌, హైదరాబాద్‌


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top