ఆమె ఎప్పటికీ నాకు ప్రాణం! అందుకోసమే.. | Love Stories In Telugu : Shiva Shankar Sad Love | Sakshi
Sakshi News home page

ఆమె ఎప్పటికీ నా ప్రాణం! అందుకోసమే..

Jan 6 2020 5:20 PM | Updated on Jan 6 2020 5:32 PM

Love Stories In Telugu : Shiva Shankar Sad Love - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తను నా మరదలు అనడం కన్నా.. నా ఆరాధ్య దేవత.. నా ప్రాణం అనొచ్చు. చిన్ననాటి నుండి తనంటే నాకు అమితమైన ఇష్టం! కానీ, అది ప్రేమ అని 8వ తరగతిలో కానీ తెలియలేదు. అది 2005వ సంవత్సరం ఏప్రిల్ నెల.. ఎర్రటి ఎండా కాలంలో తనపై నా ప్రేమ గాలులు చల్లగా వీస్తున్న రోజులు. తనకి నా ప్రేమ విషయాన్ని ఎలా చెప్పాలా అని సతమతమవుతున్నా. ఆలోచనలతోటే రోజులు గడిచిపోతున్నాయి. కానీ, నా గుండెల్లో తన గుడిని నిర్మించానన్న విషయం తనకు ఎలా చెప్పాలి అన్న ఆలోచనలతోనే సమయం గడిచిపోతోంది. 2008లో మా పదో తరగతి పూర్తి చేసుకుని ఇంటర్ మీడియట్లోకి ప్రవేశించాము. తను చదువుతున్న కాలేజీలోనే చదవాలని అనుకున్నాను. కానీ కుదరలేదు. పక్క కాలేజీలో జాయిన్ అయ్యాను.

ఎలాగైనా నా ప్రేమ విషయం తనకు చెప్పాలని డిసైడ్ అయి 2009 జనవరిలో తనకు చెప్పాను. తనకు కూడా నాపై అంతే  ప్రేమ ఉందని తెలుసుకుని చాలా సంతోషించాను. అలా 2012 వరకు మా ప్రేమ ప్రయాణం కొనసాగింది. కానీ, విధి మరోలా ఆలోచించింది. మేమిద్దరం కలిసి బ్రతకటం ఆ దేవుడికి ఇష్టం లేదేమో మమ్మల్ని విడదీశాడు.  తనకు వేరే వ్యక్తితో పెళ్లి అయిపోయింది. కారణాలు ఏమైనా కానీ తనంటే ఇప్పటికీ.. ఎప్పటికీ నాకు ప్రాణం! అందుకోసమే ఈ మధ్య తన కోసం ఒక కవిత రాశాను.          
నీ ఇష్టానికి వ్యతిరేకంగా వేసిన ఆ మూడు ముళ్లను తెంపుకుని..
అతి కష్టం మీద వేసిన ఆ ఏడు అడుగులు దాటుకుని.. 
నీవు మెచ్చిన నీ బావతో నూరేళ్ల బతకడానికి ఎప్పుడు వస్తావు..
మోడు వారిన నా జీవితంలోకి ఓ ఉషోదయాన వెలుగులు నింపడానికి తప్పకుండా వస్తావు కదూ..

 ప్రేమతో నీ ప్రేమకై ఎదురు చూసే నీ బావ
- శివ శంకర్


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement