అందుకే వాళ్లు నన్ను రిజెక్ట్‌ చేశారు | Love Stories In Telugu Mahender Breakup Love Story From Hyderabad | Sakshi
Sakshi News home page

ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నా

Nov 30 2019 12:14 PM | Updated on Nov 30 2019 12:29 PM

Love Stories In Telugu Mahender Breakup Love Story From Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

నేను దాదాపు 10 పెళ్లి చూపులకు వెళ్లాను! అమ్మాయిల్ని చూశాను. కొంతమంది అమ్మాయిలు నన్ను రిజెక్ట్‌ చేశారు. మరికొంతమందిని నేను రిజెక్ట్‌ చేశాను. ఆ తర్వాత ఓ అమ్మాయిని చూడటానికి వెళ్లా. చూడగానే నచ్చేసింది. వాళ్లు కూడా నన్ను నచ్చారు. ఐదు రోజుల తర్వాత వాళ్ల నాన్న, పెదనాన్న మార్నింగ్‌ మా ఇంటికి వచ్చారు. మాకు జాతకాలు కలిశాయని చెప్పారు. నేను చాలా సంతోషపడ్డాను. అదే రోజు సాయంత్రం వాళ్ల కుటుంబం అంతా కలిసి మా ఇంటికి వచ్చారు. మళ్లీ కట్న కానుకలు మాట్లాడుకుని వెళ్లిపోయారు. అదే రోజు రాత్రి 8:15కు ఆ అమ్మాయి నాకు వాట్సప్‌లో హాయ్‌ అని మెసేజ్‌ పెట్టింది. అలా చాట్‌ చేసుకున్నాం.. గంటలు గంటలు మాట్లాడుకున్నాం. 20రోజుల తర్వాత వాళ్ల నాన్న​ మాకు ఫోన్‌ చేశాడు. ‘సారీ ఏమీ అనుకోకండి! మాకు పెళ్లి చేయడానికి డబ్బు కుదరలేదు’ అన్నాడు. మా అమ్మ ఆ విషయం నాకు చెప్పింది. నాకు చాలా బాధ అనిపించింది.

దాదాపు 23రోజులు నాలో నేను ఏడ్చుకున్నా. ఆ అమ్మాయికి ఎన్ని సార్లు కాల్‌ చేసినా లిఫ్ట్‌ చేయట్లేదు. మెసేజ్‌లు పెడుతుంటే వాట్సాప్‌ బ్లాక్‌ చేసింది. ‘నేను కావాలని చేయలేదు.. ఇలా అవుతుందని అనుకోలేదు’ అంది. తర్వాత తెలిసింది. మేమంటే పడనోళ్లు వాళ్లకు మా గురించి తప్పుగా చెప్పారంట. అందుకే వాళ్లు నన్ను రిజెక్ట్‌ చేశారు. ఆమెకు వేరే అబ్బాయితో పెళ్లి కూడా చేశారు. వంద అబద్దాలు ఆడి ఒ​క పెళ్లి చేయటం తప్పు. నేను ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాను. ఐ మిస్‌ యూ ఐష్‌! 
- మహేందర్‌, హైదరాబాద్‌
చదవండి : అలా చేస్తే మొదటికే మోసం
ప్రేమే ఆమెను చంపేసింది!



http://special.sakshi.com/webseries/index.php/memories 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement