అతడిని తిట్టాలని బలంగా ఫిక్సయ్యా! కానీ.. | Love Stories In Telugu : I Love Him Very Much Geetha, Kaikalur | Sakshi
Sakshi News home page

అతడిని తిట్టాలని బలంగా ఫిక్సయ్యా! కానీ..

Dec 19 2019 3:26 PM | Updated on Dec 19 2019 3:40 PM

Love Stories In Telugu : I Love Him Very Much Geetha, Kaikalur - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

అతనేమో చాలా హైట్‌, నేనేమో చాలా షార్ట్‌. అతనేమో చాలా కూల్‌! నాకేమో కోపం ఎక్కువ. తనేమో మాస్‌ బ్రాండ్‌ బాబు.. నేనేమో ఆవరేజ్‌. నా లవ్‌స్టోరీ లాస్ట్‌ సెప్టెంబర్‌లో స్టార్ట్‌ అయ్యింది. కాల్‌ సెంటర్‌లో అపుడే ఫ్రెషర్‌గా అడుగుపెట్టా. ఏమీ అర్థమయ్యేది కాదు. అప్పుడే అతను నా జీవితంలోకి అడుగుపెట్టాడు. నేను వచ్చిన వారం తర్వాత నన్ను చూశాడు. అప్పటికే అతని ఫ్రెండ్‌తో గొడవై నేను సారీ కూడా చెప్పించుకున్నాను. ఆ తర్వాత నుంచి నన్ను ఏడిపించడానికి చెయ్యని ప్రయత్నం లేదు. నేనేమో ఫ్రెషర్‌!  అతను ఎన్ని వేషాలు వేసినా తిప్పికొట్టేది. ఒకసారి అతడిని తిట్టాలని మైండ్‌లో బలంగా ఫిక్స్‌ అయ్యా. కానీ, ఆ రోజు అతను చాలా సైలెంట్‌గా ఉన్నాడు. అసలు అతడిని లవ్‌ చేయకూడదు అనుకున్నా. సీన్‌ రివర్స్‌ కావటంతో సడెన్‌గా అతడి ప్రేమలో పడిపోయాను.

నన్ను వేరే ప్రాసెస్‌ డెస్క్‌కు వేయటంతో నా లైఫ్‌ అంతా ప్రశాంతంగా ఉంది. అనుకోకుండా ఒకరోజు అతను ప్రజెంటేషన్‌ ఇచ్చాడు. అప్పుడు నేను అతన్ని తప్పుగా అర్థం చేసుకున్నానని బాధపడ్డా. ఒకనెల వరకు అతడి మీదే నా ధ్యాస అంతా. ఒక రోజు వాట్సాప్‌లో సడెన్‌గా మెసేజ్‌ చేశా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ లాస్ట్‌ సీన్‌ అన్నీ చూస్తున్నా అని అన్ని విషయాలు బయటపెట్టా. అప్పటినుంచి అతను నాలాస్ట్‌ సీన్‌ చూడటం మొదలుపెట్టాడు. అలా దూరంగా ఉన్నా సోషల్‌ మీడియాతో చాలా దగ్గరయ్యాం.

నాలుగు నెలల తర్వాత నేను అతడి దగ్గరకు వచ్చాను. మా మధ్య మాటలు లేవు. కానీ, చూపులు మాత్రం ఉన్నాయ్‌. ఎప్పుడు అతడి కోసమే నా కళ్లు ఎదురు చూసేవి. అలా సైలెంట్‌గా అతడ్ని లవ్‌ చేయటం ప్రారంభించాను. అతడికి నేనంటే ఇష్టం అని అనుకుంటున్నాను. అతను నాతో మాట్లాడటానికి ట్రై చేసినపుడల్లా నిర్లక్ష్యంగా వెళ్లిపోయేది. దీంతో అతను నాకు ఇష్టంలేదనుకుని నన్ను పట్టించుకోవటం మానేశాడు. అతనంటే నాకు పిచ్చి, ప్రాణం, నా బలహీనత, బలం, నా వల్ల అతడికి ఏమైనా అయితే తట్టుకోలేను. గడ్డం అంటేనే గిట్టని నాకు అతను పెంచే గడ్డం ఇష్టం. ఎందుకంటే ప్రేమలో ఉన్నా కాబట్టి.
- గీత, కైకలూరు


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement