పెదవి పలికే ప్రతీ మాటలో నువ్వే

Love Stories In Telugu : Anil Breakup Love - Sakshi

జూలై 6 రాత్రి 11 అవుతోంది. నేను ఆఫీస్ వర్క్ కొంచెం ఎక్కువగా వుందని ఇంట్లోనుంచి పని చేస్తున్నాను. పని అవగానే నిద్ర రాకపోవడంతో ఫేస్‌బుక్‌ ఓపెన్ చేసి చూస్తున్నా. ఇలా ఓపెన్ చేశానో లేదో వెంటనే మెసెంజర్‌లో మెసేజ్‌ వచ్చింది. ఎవరో ఒక అమ్మాయి పేరుతో ఉంది. హాయ్‌! అని మెసేజ్‌ వచ్చింది. రిప్లై ఇచ్చా! అప్పటినుంచి మెసేజ్‌లు చేయటం స్టార్ట్ చేసింది. నా గురించి అంతా చెప్పేస్తోంది. ఎవరు నువ్వు? అని అడిగా. తను చెప్పలేదు సరే నువ్వు ఎక్కడ ఉంటావు? నేను ఎలా తెలుసు? అని అడిగా. అప్పుడు తను చెప్పింది ‘నేను నువ్వు ఉండే ఏరియాలోనే ఉంటాను. నేను నిన్ను రోజూ చూస్తున్నాను. నీ పేరు తెలుసుకోవడానికి నాకు సంవత్సరం పట్టింది. రీసెంట్‌గా మీ బైక్‌పై ఫైన్ పడింది.’ అని చెప్పింది. ఆ విషయం తను చెప్పే వరకు నాకు కూడా తెలియదు నేను అప్పుడే చూశా. తను చలాన్‌ సైట్‌లో దాన్ని నాకు  స్క్రీన్ షార్ట్ తీసి పంపింది.

‘అలా నీ బైక్ నెంబర్ ఆర్టీఏ చలాన్‌ సైట్‌లో చూసి, నీ బైక్ రిజిస్ట్రర్ నేమ్‌తో ఎఫ్‌బీ, లింక్డ్‌ఇన్‌, ఇన్‌స్టాగ్రామ్‌ అన్నిటిలో చూసి కన్‌ఫర్మ్‌ చేసుకున్నాక ఎఫ్‌బీలో నీతో చాట్‌ చేస్తున్నా.’ అని చెప్పింది. నా గురించి, నా డైలీ ఆక్టివిటీస్‌, సమయాల గురించి చెబుతుంటే నేను షాక్‌ అయ్యాను. ‘నా వెనుక ఇంత జరుగుతోందా’ అని. నేను షాక్‌ అయ్యాను. అప్పుడు అనుకున్నా తను కూడా నేను ఉండే దగ్గరే ఉంటూ నన్ను గమనిస్తోందని. తను వెంటనే ‘నువ్వంటే నాకు చాలా ఇష్టం! ఐ లవ్‌ యూ.. లవ్ ఆట్‌ ఫస్ట్‌ సైట్‌.. నువ్వు నాకు కావాలి. నీ నుంచి నాకు ఏమీ వద్దు! నీ ప్రేమ ఒక్కటే చాలు నాకు, నీ ఎదపై పడుకుని నీతో మాట్లాడుతూ ఉంటే చాలు’ అని అంది.

అంతా ఒక మాయగా ఉంది. నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు, కొంచెం ఆలోచించి చెప్పాను ‘మొదట నువ్వు ఎవరో చెప్పు. తర్వాత నేను ఆలోచించి చెప్తాను. నా నిర్ణయం ఏదైనా సరే లైఫ్ టైం నీకు ఒక ఫ్రెండ్‌లా మాత్రం వుండగలను’ అని చెప్పగానే తను చాలా థాంక్స్ అని చెప్పింది. ‘నువ్వు ఎవరు? ఎక్కడ ఉంటావు?’ అని మళ్లీ తనను అడిగాను. మళ్లీ మా వీధిలోనే ఉంటానంది. నాకు నమ్మకం లేక ఉండవు అని అన్నాను. అప్పుడు తను ‘మీరు బయటికి వస్తే మీరు ఏ డ్రెస్ వేసుకున్నారో, ఎక్కడ నిలుచున్నారో చెప్తాను’ అని అంది. అప్పుడు సమయం రాత్రి రెండు గంటలు అవుతోంది. నేను బయటికి వచ్చా. తను కరెక్ట్‌గా చెప్పింది. నాకు ఇంకా ఒక డౌట్ వచ్చి అడిగాను ‘అమ్మాయివి కాదు’ అని. వెంటనే నాకు వాయిస్ మెసేజ్‌ చేసింది. అపుడు కన్‌ఫర్మ్‌ అయ్యాను. తను అమ్మాయి! మా గల్లీలోనే ఉంటుంది అని.

తనని ఎన్ని సార్లు అడిగినా తను చెప్పలేదు. ఎవరు చెప్పమంటే ఒకవారం టైం అడిగింది. సరే అన్నాను అలా చాట్‌ చేస్తూ, ఉదయం 5 అయింది. ’ నా కోసం గల్లీలో ఎవర్నీ అడగకండి! మా అక్కకి తెలిస్తే కోప్పడుతుంది. మా పరువు పోతుంది. నేనే మీకు ఒకవారంలో కన్‌ఫర్మ్‌గా చెప్తాను’ అని అంది. కానీ, నా మనసు ఆగక మరుసటిరోజు మార్నింగ్‌ నుంచే తన కోసం వెతకడం స్టార్ట్ చేశా. నా ఆఫీస్ టైమింగ్స్‌, తన ఆఫీస్ టైమింగ్స్‌ వేరు వేరు కావడం వల్ల నేను తనని చూడలేకపోయాను. బట్ తను మాత్రం నన్ను చూసేది వెంటనే నాకు మెసేజ్‌ చేసేది. మూడు రోజుల తర్వాత ఒక వాయిస్‌ మెసేజ్‌ వచ్చింది. ‘నాకు మీపై ఉన్న ప్రేమను ఆపుకోలేక ఒక సంవత్సరంనుండి వేయిట్‌ చేసి మీకు చెప్పాను. స్వారీ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను. నన్ను క్షమించండి’ అని. నేను వెంటనే రిప్లై ఇచ్చా‘మీకు నచ్చినప్పుడే కలవండి.

ఒక ఫ్రెండ్‌లా మీకు లైఫ్ టైం తోడుగా ఉంటాను’ అని చెప్పాను. అలా ఒక మూడు రోజులు మళ్లీ మామూలుగానే చాట్ చేసింది. అప్పుడు చెప్పింది తన గురించి. అలా అలా మాట్లాడుతూ తన ఫ్రెండ్‌ అంకిత గురించి కూడా చెప్పింది. ఇవన్నీ చెప్పినా తను తన గురించి మాత్రం చెప్పలేదు. నాకు కోపం వచ్చి గట్టిగా అడిగాను. తనకి తెలుసు నాకు కోపం చాలా ఎక్కువ అని. అందులోనూ నాకు చాలా ఇన్‌ఫ్లుయెన్స్‌ ఉంది. ఏదైనా చేస్తాడేమో అనే భయంతో ఇల్లు ఖాళీ చేసాము అని మెసేజ్‌ పెట్టింది. తన ఎఫ్‌బీ కూడా డిసబుల్‌ చేసింది. మళ్లీ తను నాకు మెసేజ్‌ చెయ్యలేదు. కానీ, నేను తన కోసం వెతకడం మాత్రం ఆపలేదు. తను చెప్పిన  పేరును ఎఫ్‌బీలో వెతికా కానీ ఎక్కడా దొరకలేదు. ఇలా అన్ని సోషల్‌ మీడియాలో వెతుకుతున్న ఎక్కడా దొరకలేదు. మళ్లీ ఒక నెల తర్వాత మెసేజ్‌ వచ్చింది.

‘హాయ్‌! హౌ ఆర్‌ యూ’ అని నేను రిప్లై ఇచ్చా! తనని అడిగా ‘ఎందుకు పోయావ్.. మళ్లీ ఎందుకు వచ్చావ్’ అని. అపుడు తను చెప్పింది ‘నీ లైఫ్‌ని డిస్ట్రబ్‌ చేస్తున్నా అనిపించింది. అందుకే దూరంగా వున్నాను. కానీ రోజూ కలలోకి వస్తున్నావ్. అందుకే ఉండలేకపోయాను. అందుకే మళ్లీ మెసేజ్‌ చేస్తున్నా అని. ఎలా ఉన్నావ్? ఎక్కడ వుంటున్నావ్? అని అడిగితే కూకట్‌పల్లి సెవెన్త్‌ ఫేస్‌. మీరు వెతకడం చూసి నాకు భయం వేసింది. అందుకే అక్కడ నుండి ఖాళీ చేసి వచ్చేశాం’ అని చెప్పింది. ‘ఇప్పుడైనా నీ గురించి చెప్తావా లేద మళ్లీ వెళ్లి పోతావా’ అని అడిగా. ‘ఇక ఎప్పుడూ నిన్ను విడిచి వెళ్లను.’ అని అంది. వాళ్ల అక్కతో కలిసి ఊరికి వెళుతున్నానని చెప్పింది. తను ఇంటికి వెళ్లాక కూడా డైలీ బాగానే చాట్‌ చేసింది. అప్పుడు చెప్పింది తన పేరు స్వాతి అని, వాళ్లది వైజాగ్ అని. ఇక తను డైలీ ఏం చేస్తుంది.

ఎక్కడికి వెళ్లేది అన్నీ చెప్పేది. తన మాటల్లో తన ప్రేమ, సంతోషము అన్ని తన మెసేజ్‌లో తన వాయిస్ మెసేజ్‌లో తెలిసేవి. ఒక రోజు వాళ్ల బాబాయ్ ఇంటికి వెళ్లాం. అక్కడ మా అక్కను చూడటానికి మా నాన్న వాళ్ల అక్క కొడుకు వచ్చాడు! మా అక్కను చూడడానికి. కానీ, ఇలా అని మాకు ఎవరూ చెప్పలేదు. మా నాన్న ఇంటికి వెళ్ళాక మాకు చెప్పాడు. మా అక్కకు ఆ పెళ్లి చేసుకోడం ఇష్టం లేదు. ఎందుకంటే తనకి రెండో పెళ్లి. కానీ, మా నాన్న వినట్లేదు మా అక్కను ఆ అబ్బాయితో మాట్లాడు ఒకసారి అన్నారు. రేపు ఉదయం అన్నవరం గుడికి వెళ్లి మాట్లాడమన్నారు. అక్క, నేను మార్నింగ్‌ వెళ్తున్నాము. అక్క రాగానే స్టార్ట్‌ అవుతాం’ అని చెప్పింది. మరుసటి రోజు ఉదయం ‘అక్క వాళ్లు గుడికి వెళ్లారు. ఇప్పుడే దర్శనం అయింది.’ అని చెప్పింది. మధ్యాహ్నం రెండుకి మళ్లీ మెసేజ్‌ చేసింది.

‘అక్క చెప్పకుండా వెళ్లి పోయిందంట. మా బావ నాన్నకి కాల్ చేశాడు. నాన్న వాళ్లు వెతకటానికి వెళ్లారు. నన్ను హైదరాబాద్ వెళ్లమన్నారు. టిక్కెట్‌ కూడా వేశారు. నేను పది గంటలకి బస్‌ ఎ‍క్కుతాను. మార్నింగ్‌ పికప్‌ చేసుకో’ అని అంది. నేను సరే అన్నాను. తర్వాత ఇంక మెసేజ్‌ రాలేదు. మరుసటి రోజు ఈవెనింగ్ మెసేజ్‌ వచ్చింది. ‘అక్క మోసం చేసింది. సూసైడ్‌ చేసుకుంది. ఇప్పుడే క్రిమేషన్‌ అయింది.’ అని. నాకు చాలా బాధ వేసింది. బాధపడకని అన్నాను. తను ‘నాన్న హాస్పిటల్లో ఉన్నారు. తనకి గుండెపోటు వచ్చింది’ అని చెప్పింది. ఏమైనా సహాయం కావాలంటే కాల్‌ చెయ్యమని చెప్పాను. తను సరే అంది. డైలీ చాట్‌లో  అన్నీ చెప్పేది. మళ్లీ రెండు రోజుల తర్వాత మెసేజ్‌ చేసింది. వాళ్ల నాన్నను హాస్పిటల్‌నుంచి డిచార్జ్‌ చేస్తున్నారని చెప్పింది.

తన ఆఫీస్‌లో సెలవులు ఇవ్వట్లేదని, వర్క ఫ్రంమ్‌ హోమ్‌ చెయ్యమంటున్నారని చెప్పింది. లాప్‌టాప్‌ కొనడానికి మార్నింగ్‌ వచ్చి పికప్‌ చేసుకుని ఈవినింగ్‌ బస్‌ ఎక్కించమని అడిగింది. ఫోన్‌ నెంబర్‌ అడిగితే ఇచ్చాను. మరుసటి రోజు ఉదయం. తన కాల్‌ కోసం ఎదురుచూశా రాలేదు. ఏమైందో ఏమో అనే టెన్సన్‌, బాధ అన్నీ నన్ను చాలా బాధించాయ్. ఇంక నాకు ఏం చెయ్యాలో అర్థం కాక తన కోసం వెతుకుతున్నా. కానీ, తను నాకు ఒక ‍ప్రామిస్‌ చేసింది. నిన్ను ఎప్పుడూ వదిలి వెళ్లను అని. ఒకవేళ నేను ఆన్‌లైన్‌లోకి రాకపోతే నీ మంచికోసమే అనుకో కానీ, నా ఈ జీవితం నీ కోసమే అని. ఏదో ఒక రోజు అన్నీ వదిలేసి నీ కోసమే వస్తాను అని. తను ఎందుకో మళ్లీ మళ్లీ ఇవ్వలేదు. ఏమైందో అని ప్రతీ క్షణం ఆలోచిస్తున్నాను. తను ఎక్కడ ఉన్నా. సరే సంతోషంగా ఉంటే చాలు అని కోరుకుంటూ తనకై ఎదురు చూస్తూ...

మనసు గాయానికి తియ్యని తలుకువైనావు..
పెదవి పలికే ప్రతీ మాటలో నువ్వే నిలిచావు.. ఊహవైనావు, ఊపిరైనావు. 
నీతో జీవితం పంచుకునే ఆవకాశం ఇవ్వకపోయినా జీవితాంతం గుర్తుంచుకునే జ్ఞాపకాలను ఇచ్చావు. ఈ జ్ఞాపకాలు ఉన్నంత వరకు మన ప్రేమ బ్రతికే ఉంటుంది...
అదే నమ్మకంతో తన కోసం నా ఈ నీరీక్షణ...
చివరి క్షణం వరకు ఎదురు చూస్తా..
నీకై పరితపించే నా జీవితంలోకి చిరుదీపమై వస్తావని..

- నీ అనిల్‌లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

24-01-2020
Jan 24, 2020, 12:57 IST
 నా పేరు హర్ష(పేరు మార్చాం). నా జీవితంలో ఒక మంచి లవ్‌ స్టోరీ ఉంది. నేను ప్రేమించిన అమ్మాయి పేరు...
23-01-2020
Jan 23, 2020, 15:21 IST
ఓ ఫంక్షన్‌లో చూశా తనని. చూడగానే నచ్చింది. ఎవరా అని ఆరా తీయగా తను మా మమయ్య కూతురు సంధ్య...
23-01-2020
Jan 23, 2020, 14:19 IST
హాయ్‌ ఫ్రెండ్స్‌... నా పేరు నవీన్‌. మాది విశాఖపట్నం. 2019 దీపావళి రోజు నేను మామూలుగానే మాకు దగ్గరలో ఉండే...
23-01-2020
Jan 23, 2020, 12:46 IST
నేను పీజీ చదువుతున్న రోజుల్లో కీర్తిని (పేరు మార్చాం) ప్రేమించాను. ఆర్నెళ్లు తన చుట్టూ తిరిగాను. నా గురించి వాళ్ల...
23-01-2020
Jan 23, 2020, 11:39 IST
నేను తొమ్మిదవ తరగతిలో ఉన్నప్పుడు సాగర్‌ (పేరు మార్చాం) నాకు ప్రపోజ్‌ చేశాడు. అప్పుడు తను డిగ్రీ చదువుతున్నాడు. వాళ్లది...
22-01-2020
Jan 22, 2020, 20:22 IST
మా అక్కవాళ్ల ఇంట్లో ఫంక్షన్‌లో చూశా తనని. చూసిన క్షణమే పడిపోయా. ఎవరా ఈ అమ్మాయి అని ఆరాతీస్తే మా...
22-01-2020
Jan 22, 2020, 18:49 IST
నా పేరు సునీల్‌. కాలేజీలో చదువుతున్న రోజుల్లో ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాను. నా ప్రేమను మా అమ్మానాన్న ఒప్పుకోకపోవడంతో...
22-01-2020
Jan 22, 2020, 16:19 IST
ఎక్కడికి చేరుకుంటుందో తెలీదు నా ఈ ప్రయాణం. కదిలే ఈ రైలు కంటే వేగంగా కొట్టుకుంటుంది నా హృదయం. గుండెలో జరిగే...
22-01-2020
Jan 22, 2020, 12:47 IST
నేను ఇంటర్‌లో రమ(పేరు మార్చాం) అనే అమ్మాయిని లవ్‌ చేశాను. కానీ తను నన్ను లవ్‌ చేయలేదు. తరువాత ఇంటర్‌...
21-01-2020
Jan 21, 2020, 18:31 IST
వాట్సాప్‌ మెసేజ్‌తో ప్రారంభమైంది మా పరిచయం. తన పేరు లత (పేరు మార్చాం). మా కజిన్‌ ద్వారా తను నాకు...
21-01-2020
Jan 21, 2020, 16:08 IST
సరిగ్గా అది 2017వ సంవత్సరం.  నాకు ఫేసుబుక్‌ లో ఒక అమ్మాయి పరిచయం అయ్యింది. వాళ్ళది మా ఊరి పక్కనే....
20-01-2020
Jan 20, 2020, 18:12 IST
నా పేరు రాజు. నవ్య,నేను 14 ఏళ్లుగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. తనకి నేనంటే పిచ్చి ఇష్టం. నన్ను చాలా...
20-01-2020
Jan 20, 2020, 16:37 IST
ప్రాణంగా ప్రేమించాను. తనే జీవితం అనుకున్నాను. తన కోసం ఎవరినైనా ఎదురించాలి. తనతోనే జీవితం పంచుకోవాలనుకున్నా. కానీ తను నన్ను...
20-01-2020
Jan 20, 2020, 14:49 IST
ప్రేమ... అదొక అందమైన పదం. మనం నిజంగా ఒక వ్యక్తిని ప్రేమించి ఉంటే మనస్సలో వాళ్లకి  తప్ప వేరే వాళ్లకి...
20-01-2020
Jan 20, 2020, 14:35 IST
నా  పేరు శ్రీకాంత్‌. నేను ఓ కాలేజీలో బీఫామ్‌ చదువుతున్నాను. ప్రేమ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేని ఒక...
13-01-2020
Jan 13, 2020, 15:57 IST
బావా అనే పదంలో ఉండే ప్రేమ, అనుభూతే వేరు. చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరికి ఇష్టం. నా స్టడీ అయిపోయింది....
13-01-2020
Jan 13, 2020, 12:20 IST
తన పేరు మౌనిక (పేరు మార్చాం). టెన్త్‌  క్లాస్‌లో తనతో ప్రేమలో పడిపోయా. అది ప్రేమో ఏమో కూడా తెలియని వయసు....
10-01-2020
Jan 10, 2020, 13:44 IST
కాలేజీలో చేరిన కొత్తలో ఓ రోజు... మా క్లాస్‌లోకి అడుగుపెట్టింది హెచ్‌ఆర్‌ఎమ్‌ లెక్షరర్‌. ఆమెను చూడగానే నా చిన్ననాటి స్నేహితురాలు?...
10-01-2020
Jan 10, 2020, 11:07 IST
9వ తరగతి చదువుతున్నపుడు మా క్లాసులోకి కొత్తగా ఓ తమిళమ్మాయి వచ్చింది. తను ఏమంత అందంగా లేదు, నాకు అప్పట్లో ప్రేమ అంటే ఏంటో...
10-01-2020
Jan 10, 2020, 09:42 IST
మేషం : వీరు తమ ఇష్టమైన వ్యక్తులకు ప్రేమసందేశాలు అందించేందుకు శుక్ర, బుధవారాలు అనుకూలమైనవి. ఈ రోజుల్లో  అందించే సందేశాలకు...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top